Friday, February 26, 2010

సచిన్ సెంతురి ల వీరుడు


సచిన్ నువ్వే మా కాదర్శం


ప్రతిభా పాటిల్-- నీ ముచ్చటైన ఆటను చూసి,నువ్వు పరుగులను అలవోకగా కొల్లగొట్టడంచూసి మేము అంటే నేను మావారు కలిసి స్థలాలను కొల్లగొట్టడం నేర్చుకున్నాం
సోనియా గాంధీ--నీ విధ్వంసక బ్యాంటింగ్‍ను చూసే నేనుకూడా ప్రతిపక్షాలను ఎలా ఆడుకోవాలో,వాళ్ళను ఆడించాలో నేర్చుకున్నా.
మన్మోహన్ సింగ్--ఎంత ఎదిగినా ఒదగడమనేది నిన్ను చూసే నేర్చుకున్నా,విమర్శకులకు నువ్వు నీ బ్యాటింగ్‍తో సమాధానమిచ్చినట్లే నేనుకూడా సోనియమ్మముందు ఏమీ మాట్లాడకుండా తలఊపుతూనే ఉన్నా.
రోశయ్య-- ఎవ్వరికీ అందనంత నువ్వు చేసిన పరుగులను చూసే సామాన్య ప్రజలకందని లక్షకోట్లపైన బడ్జెట్‍ను ప్రవేశపెట్టి రికార్డ్ సాధించా.
కిరణ్కుమార్ రెడ్డి--నువ్వు ఏవిధంగా అయితే ప్రత్యర్థి ఎవరైనా భయపడకుండా వీరబాదుడు బాది పరుగులు సాధిస్తావో అలానే ప్రతిపక్షంలో ఎవరైనా సరే నా బాదుడుతో నోరుమెదపకుండా చేస్తున్నా.
చంద్రబాబునాయుడు--నువ్వు ఏవిధంగా అయితే అత్యధిక పరుగులతో ముందుకుపోతున్నావో నేను కూడా అలానే ముందుకే పోతున్నాను.


Saturday, February 6, 2010

తెలుగు పుస్తక ప్రచురణక్రమం

తెలుగు పుస్తక ప్రచురణక్రమం

(సోర్సు: www.pusthakalu.net)


సృష్టిలో ప్రతి ప్రాణికి తనకంటూ ఒక భాష ఉంటుంది. మానవులకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయా ప్రాంతాలనుబట్టి రకరకాల భాషలు ఉంటాయి. ఎవరికివారే ఘనులు కాబట్టి అందరూ తమ జాతి, తమ భాష గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు.

జాతుల సంగతి ఎలా ఉన్నా భాష విషయానికి వస్తే ఏ భాష అభివృద్ధికైనా సాహిత్యమే పట్టుగొమ్మ. సాహిత్యానికేమో రచయిత, ప్రచురణకర్త, పుస్తక విక్రేత, పాఠకుడు మూలస్తంభాలు. ఇందులో ఏ ఒక్క స్తంభం దెబ్బతిన్నా సాహిత్యం పునాదులు కదిలినట్లే.

సుమారు మూడొందల సంవత్సరాలకు పూర్వం చైనా నుంచి బయలుదేరి యూరప్ మీదుగా మన దేశం చేరిన అచ్చు యంత్రం 1811 సెరంపూర్ లో తమ పని ప్రారంభించింది. అంతకు ముందు తాళపత్రాలపైనా, శుభ్రం చేసిన జంతు చర్మాలపైనా, రాగి రేకుల పైనా రచనలు జరిగేవి. సెరంపూర్ లోని క్రిస్టియన్ మిషనరీలు మతప్రచార సాహిత్య ప్రచురణకు గాను, ఆ తర్వాత వరుసగా మద్రాసు, బళ్ళారి, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‍లలో ప్రచురణ సంస్థలను ప్రారంభించాయి. ఆంగ్లేయులు తమ పాలనా సౌలభ్యం కోసం, మిషనరీలు తమ మతప్రచారానికి తప్పని సరిగా స్థానిక భాషలు నేర్చుకోవల్సి వచ్చింది. అందుకోసంగాను 19వ శతాబ్దం ప్రారంభంలో నిఘంటువులు, వ్యాకరణాలపైనా అధ్యయనం చేసి పుస్తకాలు ప్రచురించారు. మత ప్రచరానికి గాను విరివిగా కరపత్రాలు ప్రచురించారు.

సి.పి.బ్రౌన్ ఇంగ్లీషు- తెలుగు నిఘంటువు(1812) తో ప్రారంభమైన తెలుగు ప్రచురణ కాంప్‍బెల్, రావిపాటి గురుమూర్తుల తెలుగు వ్యాకరణాల(1816)తో ముందుకు సాగింది. అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో స్థాపితమైన మద్రాసు స్కూల్ బుక్ సొసైటీ (1820) తెలుగులో వాచకములు, విక్రమాదిత్య కథలూ, వేమన పద్యాలు, సుమతీ శతకము, అమరము మొదలైన పుస్తకాలు ప్రచురించింది. అప్పట్లో ప్రచురితమైన ఆంధ్ర శబ్ద చింతామణి (1840), సి.పి.బ్రౌన్ ఇంగ్లీషులోకి అనువదించిన వేమన శతకమూ(1829), బెండగిరి నాగయ్య సటీకాంధ్ర శేషము(1840), అక్షర క్రమ నిఘంటువు (1842), మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక (1848) మొదలైన గ్రంధాలు ప్రచురితమై ఆంగ్లేయులకు బాగా ఉపయోగపడ్డాయి.

చిన్నయ్య సూరి బాలవ్యాకరణం, నీతిచంద్రికల ప్రచురణ, తెలుగు ప్రచురణ రంగంలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 19వ శతాబ్ధ ద్వితీయార్థంలో తెలుగు రచనలు, ప్రచురణలకు ప్రోత్సహించిన వారిలో శ్రీయుతులు కందుకూరి వీరేశలింగం, వేదం వెంకట రాయ శాస్త్రి, వెంకట పార్వతీశ్వర కవులు, చిలుకూరి వీరభద్రరావు, కొమ్మరాజు వేంకట లక్ష్మణరావు, గురజాడ అప్పారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, గురజాడ శ్రీరామమూర్తి గార్లను ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రచురణ రంగంలో మద్రాసులో 1854లో స్థాపించిన వావిళ్ళ రామస్వామిశాస్త్రులు ఆండ్ సన్స్, సి.పి.బ్రౌన్ల పాత్ర తెలుగుజాతి మరువరానివి. అప్పటివరకూ తెలుగులో ఆసక్తి ఉన్న రచయితలు తమ రచనలను తామే ఏవో తిప్పలు పడి ప్రచురించుకొని తామే అమ్ముకొని, అమ్ముకోలేనప్పుడు ఉచితంగా పంచి పెట్టేస్తుండేవారు. ఈ పరిస్థితి ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నా, వావిళ్ళ స్థాపనతో ప్రచురణ సంస్థలు లాభనష్టాల భారాన్ని చాలా వరకూ తమ నెత్తికి ఎత్తుకునే సంప్రదాయం ప్రారంభమయ్యింది.

తెలుగు ప్రచురణకు 19వ శతాబ్దంలో చాలా వరకూ మద్రాసే కేంద్రంగా ఉండేది. సరస్వతీ తిరువేంకటాచార్యులు, పాలపర్తి నాగేశ్వరరావు, బి.వి. రంగయ్య శ్రేష్ఠి, వంకాయల కృష్ణస్వామి శెట్టి, పిడుగు వెంకట కృష్ణారావు, వేదం వెంకటరాయ శాస్త్రి మద్రాసులో ప్రచురణ రంగానికి ఆద్యులు అని చెప్పుకోవచ్చు. ప్రాచీన గ్రంధాలు ప్రచురించిన జ్యోతిష్మతి ముద్రణాలయం, వనప్పాకం అనంతాచార్యులు స్థాపించిన వైజయంతీ ముద్రాక్షరశాల, రెంటాల వెంకట సుబ్బారావుగారి విక్టోరియా డిపోలే కాకుండా న్యాయశాస్త్ర పుస్తకాలు, వివిధ సంస్కృత గ్రంధాలు ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి, వైష్ణవ సంప్రదాయ గ్రంధాలు ప్రచురించిన కందాల శేషాచార్యులు మద్రాసులో తెలుగు ప్రచురణ రంగానికి తమ వంతు కృషి చేసిన వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వారనవచ్చు.

అప్పట్లో కందుకూరి వీరేశలింగం, వావిల కొలను సుబ్బారావుగార్లు మద్రాసులోనే ఉద్యోగాలు చేస్తుండేవారు. పిఠాపురం రాజా, జయంతి రామయ్య పంతులు మద్రాసు కేంద్రంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించి విశేష కృషి చేశారు. వెస్ట్ వర్డ్ కంపనీ, అమెరికన్ డైమెండ్ ప్రెస్, పెద్ద బాల శిక్ష ప్రచురించిన ఎన్.వి.గోపాల్ ఆండ్ కో., వాచకాలు, వ్యాకరణాలు, ప్రబంధాలు, భారత భాగవత రామాయణాలు ప్రచురించిన వెంకటేశ్వర ఆండ్ కో, ఆనంద్ ప్రెస్, మొదలైన కంపెనీలే కాక, కవిత్రయ భారతాన్ని ప్రచురించిన నాతానమ్మయ్య శెట్టి, ఆయుర్వేద గ్రంధాలు ప్రచురించిన డి.గోపాలాచార్యులు, ఆర్య భారతీ గ్రంధమాల – ఆది నారాయణ శాస్త్రి గార్ల కృషి గత శతాబ్ధంలో చెప్పుకో తగ్గది. ఇదే కాలంలో బిటీషు ప్రచురణ సంస్థలు మాక్మిలాన్, ఓరియంట్ లాంగ్మన్, ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్సులు వ్యాపారదృష్టితో మద్రాస్ కేంద్రంగా మనదేశంలో ప్రచురణలు ప్రారంభించాయి. పెరుగుతున్న విద్యాకాంక్షను దృష్టిలో ఉంచుకొని వారు బొమ్మలతో పాఠ్య పుస్తకాలను ప్రచురించారు. ఈ పుస్తకాలను మార్పడన్ అను ఆంగ్లేయుడు వీరేశలింగంగారి సహకారంతో తయారుచేశాడు. అదే సమయంలో ఆనంద్ ప్రెస్, క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీలు కూడా రంగంలోకి దిగాయి. చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన రామచంద్ర విజయం, అహల్యా భాయి; కందుకూరి వీరేశలింగం – అభిజ్ఞాన శాకుంతలం, హాస్య సంజీవిని, ఆంగ్ల కవుల చరిత్ర; బహుజనపల్లి సీతారామాచార్యులు – శబ్దరత్నాకరము; గురజాడ శ్రీరామ మూర్తి – కవి జీవితములు; మదిర సుబ్బన్న దీక్షితులు గారి కాశీ మజిలీ కథలు; వడ్డాది సుబ్బారాయుడు భక్తి చింతామణి; గురజాడ అప్పారావు కన్యాశుల్కం, యనమండ్ర వెంకట రామయ్య పురాణ నామ చంద్రికలు – గత శతాబ్దంలో వెలువడిన కొన్ని ఉత్తమ ప్రచురణలు. ఆ శతాబ్ధంలో సాహిత్యపోషణ పేరిట పుస్తక ప్రచురణ ఎక్కువ రాజుల ప్రాపకంలో జరిగేది. పిఠాపురం, బొబ్బిలి, ముక్త్యాల, పానుగల్లు, పాలవంచ, కార్పేటి నగరం, సాలూరు, చల్లపల్లి, న్యూజివీడు రాజులు ముఖ్యులు అనవచ్చు.

ఈ శతాబ్ద ప్రారంభం నుంచీ ప్రచురణ రంగానికి సంబంధించిన సమాచారం పూర్తిగా కాకున్నా విరివిగానే లభిస్తోంది. సమాజంలో చోటు చేసుకున్న మార్పులు, సంఘం, భాష, సార్వస్వత సంస్కరణ ఉద్యమాలు ప్రత్యేక సంస్థలు, ప్రత్యేక సాహిత్యం ఉన్నాయి. 1905లో కొమ్మరాజు లక్ష్మణరావు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, రావిచెట్టు రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రాజా నాయని వెంకట రంగారావు స్థాపించిన విజ్ఞాన చంద్రిక గ్రంధ మండలి ఈ రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. ఉన్నత ఆశయాలతో వారు ప్రచురించిన గ్రంధాలు నేటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. అబ్రహం లింకన్, బెజమెన్ ఫ్రాంక్లిన్ల జీవిత చరిత్రలు, ఆంధ్రుల చరిత్ర, శివాజీ చరిత్ర, రసాయన శాస్త్ర పదార్థ విజ్ఞాన శాస్త్ర, అర్థశాస్త్రం, ఆరోగ్య సంబంధ పుస్తకాలనెంటినో ఈ సంస్థ ప్రచురించింది. దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ భాషలో మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించిన ఘనత ఈ సంస్థదే! వీరు నిర్వహించిన చారిత్రక నవలల పోటీలో దుగ్గిరాల రాఘవచంద్రయ్య సచ్చాస్త్రి రాసిన విజయనగర సామ్రాజ్యము పుస్తకానికి ప్రధమ బహుమతి ఇచ్చారు. వీరు 1916 వరకూ సుమారు ముప్ఫై పుస్తకాలు ప్రచురించి మొదటి ప్రపంచ యుద్ధకాలంలో సంస్థను తాత్కాలికంగా ఆపివేశారు. తిరిగి 1924లో పునరుద్ధరణ ప్రయత్నాలు జరిగాయి కానీ సఫలం కాలేదు.

ఈ దశాబ్ధంలో వెలువడిన గ్రంధాలలో పానుగంటి లక్ష్మీనరసింహరావు-రాధాకృష్ణ, తిరుపతి వెంకట కవుల పాండవ జననమూ, పాండవ విజయమూ వగైరా, దాసు నారాయణ రావు పాదుకా పట్టాభిషేకమూ, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, ఉన్నవ లక్ష్మీనారయణ అక్బరు చరిత్ర, బండారు అచ్చమాంబ -అబలా సచ్చరిత్ర రత్నమాల, చిలకమర్తి – సౌందర్య తిలకం; ముడుంబై అలివేలు మంగతాయారు – శ్రీ జనకల్పవల్లి; చాగంటి శేషయ్య, చిలంగి శ్రీనివాసరావు వగైరాలు అనువదించి ప్రచురించిన బెంగాలీ నవలలు (రాధారాణీ, కృష్ణకాంతుని మరణశాసనము); గురజాడ అప్పారావు – నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, దిద్దుబాటు; రాయప్రోలు సుబ్బారావు- తృణకంకణము, వేటూరి ప్రభాకర శాస్త్రి కనకాభిషేకము మొన్నగునవి.

1908లో స్థాపించిన ఆంధ్రపత్రిక కూడా రచనలు ప్రోత్సహించి తన వంతు కృషి ఛేసింది. అదే సంవత్సరంలో బందరులో ఆంధ్ర భాషాభివర్ధని గ్రంధమాలను స్థాపించారు. వెంకట పార్వతీశ్వర కవుల రచనలు, వివిధ అనువాదాలను ప్రచురించిన ఆంధ్ర ప్రచారిణి గ్రంధమాలను అయ్యగారి నారాయణ మూర్తి, నిడదవోలు రామచంద్రా రెడ్డి మొదలైన వారు స్థాపించారు. 1911లో పిఠాపురం మహారాజు, జయంతి రామయ్య పంతులు, వేదం వేంకట రాయశాస్త్రి – ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించి గ్రాంధిక భాషా ప్రచారానికి తీవ్రంగా కృషి చేశారు. వారికి పోటీగా గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతుల గార్లు వ్యావహారిక భాష ప్రచారం చేశారు.

1914లో కృష్ణాజిల్లాలో పటమట కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ స్థాపన జరిగింది. ముసలమ్మ మరణం లాంటి పుస్తకాలెన్నింటినో ప్రచురించిన ఈ సంస్థ నడిపిన గ్రంథాలయోద్యమం దేశవ్యాప్త ఖ్యాతిని సంపాదించుకుంది. చెన్నపూరి ఆంధ్రమహాసభ 1916నుంచి ప్రచురణలో ప్రారంభించింది. తెనాలిలో తల్లావఝ్జల శివశంకర శాస్త్రి ఆద్వర్యంలో 1918లో ఏర్పడిన సాహితీ సమితి ఎన్నో ఖండకావ్యాలను ప్రచురించింది. 1918లో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా కొన్ని రచనలు ప్రోత్సహించి ప్రచురణలకు అవకాశం ఇచ్చింది. ఈ దశాబ్దంలో రాయప్రోలు సుబ్బారావు – స్నేహలత, అబ్బూరి రామకృష్ణారావు – జలాంజలి, వేటూరి ప్రభాకర శాస్త్రి – చాటుపద్యమణిమంజరి, ధర్మవరం రామకృష్ణాచార్యులు – విషాద సారంగధరం, గురజాడ శ్రీరామ మూర్తి -తిమ్మరుసు చరిత్ర, కాళ్ళకూరి నారాయణరావు -పద్మవ్యూహము, చిలకమర్తి – రాజరత్నము, పానుగంటి లక్ష్మీనరసింహరావు – ఆధునిక కవి జీవితములు, దువ్వూరి రామిరెడ్డి – కృషీవలుడు, దీపాల పిచ్చయ్య శాస్త్రి – చాటు పద్య రత్నాకరము చెప్పుకో తగ్గవి.

ఇప్పటివరకూ ఆదర్శం ప్రధానంగా ప్రచురణలు సాగాయి. 1920 తర్వాత మాత్రం వ్యాపార దృష్టి సోకిన దాఖలాలు కనిపిస్తున్నాయి. సమిష్టిగా తప్ప ఈ రంగంలోకి అడుగిడేందుకు సాహసించని కాలం పోయి, చాలా మంది ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలూ బయలుదేరారు. 1920లో మారుతీ రామా ఆండ్ కో, విజయవాడ, 1921లో ఆంధ్రగ్రంథమాల, మద్రాస్ (ఆంధ్ర పత్రిక వారిది), 1923లో ఎం. శేషాచలం ఆండ్ కో, బందరు, 1923లోనే సరస్వతీ గ్రంథ మండలి, అద్దేపల్లి లక్ష్మణ స్వామీ ఆండ్ కో., రాజమండ్రి, 1925లో ది ఓరియెంట్ పబ్లికేషన్స్ కంపెనీ, తెనాలి, 1928లో బాల సరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 1930లో రాయలూ ఆండ్ కంపెనీ, కడప, 1930లోనే జయానికేతన్, తాడేపల్లి గూడెంలు స్థాపితాలై ప్రచురణ రంగంలో ఉప్పెన సృష్టించాయి. ఆ దశాబ్దంలోనే పుస్తక విక్రేతలు ఈ రంగంలోకి అడుగిడి ప్రచురణకు మంచి ఊతం ఇచ్చారని చెప్పుకోవచ్చు. కె.ఎన్. కేసరి 1928లో గృహలక్ష్మీ మాస పత్రికను మద్రాసులో స్థాపించారు. ఈ దశాబ్దాంతంలోనే రాజమండ్రిలో శృంగార గ్రంథమాల, అభినవాంధ్ర గ్రంథమాలలు, నల్గొండ జిల్లా సూర్యపేటలో కృషి ప్రచారిణి గ్రంథమాలలు విశేష కృషి సలిపాయి. ఆంధ్రపత్రిక తరఫున కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు స్థాపించిన ఆంధ్ర గ్రంథమాల సంస్థ భగవద్గీత, బసవపురాణం, పండితారాథ్య చరిత్రలు ప్రచురించారు. పద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరావు సోదరులు మొదట యునిగుర్తిలో స్థాపించి తరువాత కరీంనగర్ నెమలి కొండకు తరలించిన విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల 1932 వరకూ 21 గ్రంథాలను ప్రచురించింది.

1930 తర్వాత ప్రజలలో స్వాతంత్రేచ్ఛ పెరిగి స్వాతంత్ర పోరాటం ఉదృతం కావడమే కాక, విజ్ఞాన పిపాస కూడా బాగా పెరిగి, ప్రచురణ రంగానికి మంచి ఊతమిచ్చింది. దాంతో ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేత సంస్థ గణనీయంగా పెరిగింది. పాలకొల్లు కేంద్రంగా ఆండ్ర శేషగిరి రావు, విజాపూరి గ్రంథమాల స్థాపించారు. పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ, తదితరులు విశాఖపట్నంలో కవితా సమితి స్థాపించి రచయితలను తద్వారా ప్రచురణాలయాలను ప్రోత్సహించారు. ఈ దశాబ్దంలో ప్రముఖ రచనలెన్నో ప్రచురితాలయ్యాయి. 1931లో బళ్ళారిలో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, 1931లోనే దోమా వెంకటస్వామిగుప్తగారి వాఙ్మయ వినోదినీ గ్రంథమాల, 1935లో ముంగండలో విశ్వసాహిత్యమాల, 1936లో కవితిలక గ్రంథమాల, మద్రాస్, 1938లో హైదరాబాద్‍లో అణా గ్రంథమాల, 1938లోనే వట్టికోట అళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల, 1939లో గుండువరపు హనుమంతరావు హైదరాబాద్ ఆంధ్రకేసరి గ్రంథమాల మొదలైన సంస్థలు సలిపిన సాహిత్యసేవ గణనీయమైనది. వీటిలో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపకుల ఉద్యోగరీత్యా గ్రామాంతరాలు వెళుతూ ఉండటంతో ఆ సంస్థ అనంతపురం, హిందూపురాలకు మారుతుండేది. ఇఫ్పటికీ హిందూపురం కేంద్రంగా పని చేస్తూనే ఉంది.

గద్దె లింగయ్య 1931లో స్థాపించిన ఆదర్శ గ్రంథమండలి 1950లో విజయవాడకు తరలింది. ఈయన రాసిన విప్లవ వీరులు, విప్లవ యుగము నిషేధానికి గురయ్యాయి. లింగయ్య పడవలపై అచ్చుయంత్రాలను అమర్చి రహస్యంగా పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించి స్వాతంత్రోద్యమానికి ఎంతగానో పాటుపడ్డారు.
బెంగాలీ నవలల అనువాదాలు మొదలైన పుస్తకాలు సుమారు ఓ 150 వరకు ప్రచురించిన ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల 1936లో రజతోత్సవం జరుపుకుంది. కృష్ణాజిల్లా పెడసనగల్లులోని నవయుగ ప్రచురణాలయం వారు నార్ల వెంకటేశ్వరరావు రచనలు, రష్యన్ గాథల అనువాదాలను, స్వదేశీ సంస్థానాలు, గోపీచంద్ అసమర్థుని జీవయాత్రలను ఈ దశాబ్దంలోనే ప్రచురించారు. తెనాలి యువబుక్స్ వారు కొడవటిగంటి కుటుంబరావు రచనలు, చక్రపాణి శరత్ రచనల అనువాదాలు కూడా ఇప్పటివే. ఈ దశాబ్దంలో గ్రంథాలయోద్యమం, స్వాతంత్రోద్యమాలు ముమ్మరంగా సాగి తమతోబాటు ప్రచురణ రంగానికి కూడా తీరిక లేకుండా చేశాయి.

ఇక 40వ దశకానికివస్తే, 1940లో కల్చరల్ బుక్స్ లిమిటెడ్, మద్రాస్, 1942లో ప్రజాశక్తి ప్రచురణాలయం - మొగల్రాజపురం, విజయవాడ, 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తు – హైదరాబాద్, 1943లోనే దేశీకవితా మండలి – విజయవాడ, 1945లో త్రివేణీ పబ్లిషర్స్ – మచిలీపట్నం స్థాపితాలై విశేషకృషి చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఈ దశాబ్దంలో స్వాతంత్ర్య, గ్రంథాలయోద్యమాల ప్రభావం ప్రచురణాలయాలపై బాగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రభుత్వం సైనికుల కాలక్షేపం కోసం పుస్తకాలను విరివిగా కొనేది. నవలలు చదవడం తప్పుగా భావించే ఆ కాలంలో జంపన, కొవ్వలిల నవలలు దొంగతనంగానైనా చదివేవారు చాలామంది ఉండటంతో నవలలు ప్రచురణకు గుర్తింపు వచ్చింది. స్వాతంత్ర్యానంతర కాలంలో, 1947లో తెలుగు భాషా సమితి-మద్రాస్ 1948లో ఈదర వెంకటరావు, వెంకట్రామయ్య - వెంకట్రామా ఆండ్ కో- ఏలూరు, కొండవల్లి వీరవెంకయ్య ఆండ్ సన్స్- రాజమండ్రి, ప్రగతి ప్రచురణాలయం – నిడమర్రు, బి.వి. ఆండ్ సన్స్ – కాకినాడ, నాస్తిక కేంద్రం- విజయవాడ, జనతా ప్రచురాణలయం – విజయవాడ 1950లో పశ్చిమ గోదావరి జిల్లా నత్తరామేశ్వరంలో కాలచక్రం ప్రచురణలు పుట్టి విశేష కృషి చేశాయి. 1953లో స్థాపితమైన విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రత్యేక సిద్ధాంతంతో ప్రచురణలు ప్రారంభించి కాలగమనంలో ఎన్నో ఆటుపోటులు తట్టుకొంటూ ఏవో కొన్ని మార్పులతో విజయవంతంగా కొనసాగుతోంది.

తరువాతి దశాబ్దంలో స్థాపించిన ప్రచురణ సంస్థలలో మరియు విజయవాడలో సాహిణీ పబ్లికేషన్స్, గుంటూరులో నవయుగ పబ్లిషింగ్ హౌస్, నగారా పబ్లికేషన్స్, సికింద్రబాద్‍లో దాచేపల్లి కిష్టయ్య ఆండ్ సన్స్, శ్రీరామా బుక్‍డిపో, యువభారతి, ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్, విజయవాడలో నవోదయ పబ్లిషర్స్, జయంతీ పబ్లికేషన్స్, ప్రేమ్‍చంద్ పబ్లికేషన్స్, గుంటూరులో కరుణశ్రీ కావ్యమాల, రాజమండ్రిలో కళాభివర్థినీ పరిషత్తు, కాళహస్తి తమ్మారావు ఆండ్ సన్స్ చెప్పుకోతగ్గవి. ఇవే కాక 1957లో స్థాపితమైన ఆంధ్రపదేశ్ సాహిత్య అకాడమీ కృషి కూడా చెప్పుకోతగ్గది.

1960 తరువాతి కాలానికి వస్తే ప్రతిమా బుక్స్, మద్రాస్, ఏలూరులోని గుండిమెడాస్, విజయవాడలోని వీ.ఎస్.ఎస్ ఆండ్ సన్స్, హితకారిణీ సమాజం, రాజమండ్రి, రవికోకిల పబ్లికేషన్స్, నెల్లూరు, విజయవాడలో నవభారత్ బుక్ హౌస్, నవ్యజ్యోతి పబ్లికేషన్స్, న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్, అరుణ పబ్లిషింగ్ హౌస్, మహాలక్ష్మి బుక్ ఎంటర్‍ప్రైజెస్, విజయవాడ, క్వాలిటీ పబ్లిషర్స్, శ్రీరామా బుక్ డిపో, విశాఖ సాహితీ సంస్థలు చెప్పుకోదగ్గవి.

1960 దశకంలో ఆంధ్రప్రభ వార పత్రిక రంగనాయకమ్మ రచించిన కృష్ణవేణి, కోడూరి కౌసల్యాదేవి రచించిన చక్రభ్రమణాలను ప్రచురించడంతో ఒక కొత్త శకం ప్రారంభమయ్యినట్లుగా చెప్పుకోవచ్చు. అప్పటి నుండీ సుమారు ఓ రెండు దశబ్దాల పాటు రచయిత్రుల నవలల వెల్లువతో ప్రచురణ రంగం లాభాల జడివానలో తడిసింది. ఆ పరిస్థితి ఎందరినో ప్రచురణా రంగం దిశకు ఆకర్షించింది. 1965 నుండి 1980 వరకూ ప్రముఖ రచయిత్రుల నవలలు సెట్లు సెట్లుగా ప్రచురించి చాలా సంస్థలు భారీ వ్యాపారం చేశాయి.

అసలు 1965 నుండి 1980 వరకూ పరిశీలిస్తే మూడు అంశాలను ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంది. హింద్ పాకెట్ బుక్స్, న్యూ ఢిల్లీ వారి ప్రేరణతో ఎం. శేషాచలం కంపెనీ ప్రవేశపెట్టిన ఇంటింటా గ్రంథాలయం స్కీము, సాహిత్య సంస్థగా గుర్తింపు పొంది, వంద పుస్తకాల వరకూ ప్రచురించిన యువ భారతీ సంస్థ మెంబర్ షిప్ స్కీము, నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రేరణతో ఏర్పాటు చేస్తున్న బుక్ ఫేర్లు ప్రజల చేత పుస్తకాలు విపరీతంగా కొనిపించగలిగాయి, గలుగుతున్నాయి.

ప్రస్తుతం గ్రంథాలయోద్యమం స్పూర్తి సన్నగిల్లి, మంచి సాహిత్యం, నవలలు వెలువడక, టీవీ ప్రభావం వల్లా తెలుగు ప్రచురణ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ నేటి పాఠకులు అవసరాల మేరకు కాల్పనికేతర సాహిత్యం ప్రచురిస్తున్న సంస్థల పరిస్థితి మాత్రం చాలా బాగుంది. టివీ ప్రభావం తగ్గితే గనుక తమకు మంచి రోజులు వస్తాయని కాస్త వెనుకబడ్డ ప్రచురణ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

Saturday, January 30, 2010

జై హో మహత్మా గాంధీ

మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ
పేరు : మహాత్మా గాంధీ.
తండ్రి పేరు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ( మహాత్మా గాంధీ ).
తల్లి పేరు : పుత్లీబాయి.
పుట్టిన తేది : 2-10-1869.
పుట్టిన ప్రదేశం : పోరుబందర్.
చదివిన ప్రదేశం : లండన్.
చదువు : లాయర్.
గొప్పదనం : శాంతియుతంగా అనేక సత్యాగ్రహాలు చేసి భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు.
స్వర్గస్తుడైన తేది : 31-1-1948.

మహాత్మా గాంధీ గుజరాత్ లోని ఖయిత్వాద్ ప్రాంతంలోని పోరుబందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు 1869వ సంవత్సరం అక్టోబర్ 2న జన్మించాడు. నీతి నిజాయితీలకు కట్టుబడిన కుటుంబంలో జన్మించిన గాంధీ చిన్నతనం నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ, తల్లి దండ్రుల యెడల గురువుల యెడల ఎంతో వినయ విధేయతలతో ఉంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. మోహన్ దాస్ కి పన్నెండవ సంవత్సరంలోనే కస్తుర్భాతో వివాహమయింది. అంత చిన్నతనంలో పెళ్ళిచేసుకోవటం అతనికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల మాట జవదాటలేక అంగీకరించాడు.వివాహ కారణంగా గాంధీ చదువు ఒక ఏడాది వృధా అయింది.

తండ్రి నుండే గాంధీ సుసంపన్నమైన జానపద కథలు, తమ ప్రాంత వైశిష్ట్యం తెలుసుకొన్నాడు. గుజరాతీయులకు 19వ శతాబ్ధం నుండి సముద్ర వాణిజ్య సంబంధాలుండేవి. పోరుబందర్ కు చెందిన ముస్లిం వర్తకులకు ఆ కుటుంబంబానికి సన్నిహిత సంబంధాలుండేవి. గాంధీకి దక్షిణాఫ్రికాకు వెళ్ళే అవకాశం కూడా ఆ సంబంధాలవల్లే లభించింది. కరంచంద్ గాంధీ వేర్వేరు సమయాల్లో పోరుబందర్, రాజ్ కోట్, వెంకనెర్ లకు ప్రధానమంత్రిగా పని చేసారు. గాంధీ గారి తాతయ్య, పెదనాన్న కూడా ఇవే పదవులు అలంకరించారు. ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు. ఈ కుటుంబీకులెవరూ పెద్దగా ఆస్థి పాస్థులు వెనుకేసుకోలేదు. కరంచంద్ తండ్రి ఉత్తమ్ చంద్ ఒకసారి జునాగఢ్ నవాబుకు ఎడమ చేతితో సలాం చేశాడు. ఆగ్రహించిన నవాబు క్షమాపణ చెప్పమని ఆదేశించాడు. తన కుడి చేయి ఇప్పటికే పోరుబందర్ కు అంకితమైందని అందువల్లే ఎడమచేతితో అభివాదం చేశానని సమాధానమిచ్చాడు. గాంధీకి ఏడేళ్ళ వయస్సు వచ్చేనాటికి 120 మైళ్ళ దూరంలోని రాజ్ కోట్ కు కాపురం మారింది. పోరుబందర్ లోనే గాంధీ ప్రాథమిక విద్య పూర్తయింది. అక్కడి స్కూల్లో పిల్లలు నేలపైన కూర్చొని మట్టిపైన చేతివేళ్ళతో అక్షరాలు రాసుకొనేవారు. పాఠశాలలో గాంధీ సాధారణ విధ్యార్ధి. బిడియంగా, ఒంటరిగా వుండేవాడు. అయితే ఖయిత్వాద్ సంస్కృతి, కుటుంబ వాతావరణం బాల గాంధీ మనసుపై చెరగని ముద్ర వేశాయి. అతని వ్యక్తిత్వ రూపకల్పనలో సాయపడ్డాయి. ఖయిత్వాద్ లోని జైన సంస్కృతి ప్రభావం గాంధీపై అమితంగాపడింది.

గాంధీజీ తల్లి పుత్లీబాయి స్నేహశీలి, ధార్మికురాలు, మృదుభాషిణి. ఆ ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకొనేది. ఆభరణాలంటే ఆమెకు అయిష్టం. దైవచింతన అధికం. నిత్యం పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తుండేది. ప్రేమమయమైన ఆమె వాత్సల్యం, దృఢచిత్తం, నిరాడంబరత మోహన్ దాస్ పై చెరగని ముద్రలు వేశాయి. "సన్యాసిని పోలిన ఆమె వ్యక్తిత్వం నా జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని" గాంధీజీ తన ఆత్మ కథలో తల్లి గురించి రాసుకున్నాడు. తండ్రి కరమ్‌చంద్ పెద్దగా చదువుకోకపోయినా వ్యవహారజ్ఞాని. "తన వారిని ప్రేమించేవాడు. సత్యనిష్టా గరిష్టుడూ, ధైర్యశాలి, వితరణశీలి." అని గాంధీజీ పేర్కొన్నాడు. ఆ ఇంట్లో ఎప్పుడూ రామాయణ, భారత పారాయణాలు జరుగుతుండేవి. ముస్లిం, జైన్ పార్శీ తదితర మతాలకు చెందిన మిత్రులతో కరంచంద్ నిత్యం మతపరమైన చర్చలు జరుపుతుండేవాడు.

ఆ ఇల్లు మత సామరస్యానికి నిలయంగా నిలిచేది. మోహన్ దాస్ కు ఆ విధంగా అన్ని మతాలపై గౌరవం, విభిన్న మతావలంబీకులపై సౌభ్రాతృత్వ భావం తండ్రి నుండి అబ్బింది. 1886లో కరంచంద్ కు తీవ్ర అనారోగ్యం ఆవరించింది. గాంధీ రాత్రి పొద్దుపోయేదాకా తండ్రికి సపర్యలు చేసేవాడు. కొద్దిరోజులకే తండ్రి చనిపోయాడు. తండ్రి మరణంతో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. 1887 లో మెట్రిక్ పాస్ అయిన గాంధీ భావనగర్ కాలేజీలో ఉన్నత విద్యకై చేరాడు. అక్కడి వాతావరణము నచ్చలేదు. దీంతో ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. ఇప్పుడేం చేయాలి? అన్నది ప్రశ్నార్ధకంగా తయారయింది. ఆ కులస్థుల కుటుంబాల్లో సముద్రయానం నిషిద్దం. ఆ కుటుంబానికి చిరకాల మిత్రుడైన యాదవ్ జీ ఇంగ్లాండు వెళ్ళి లా చదవమని చెప్పాడు. న్యాయశాస్త్రం అయితే ప్రధానమంత్రి కావచ్చని అదే వారి కుటుంబ వారసత్వాన్ని నిలుపుకొనే కోర్సు అని యాదవ్ జీ చెప్పాడు. తాత తండ్రుల్లా నీవు కూడా ప్రధానమంత్రి కావటం మంచిది అని చెబుతాడు.

అన్నయ్య ఊగిసలాటలు, తల్లి అభ్యంతరాలు, భార్య కన్నీళ్ళు, బంధుమిత్రుల ఆంక్షలు, వెక్కిరింతలు బెదిరింపులు గాంధీని ఇరకాటంలో పడవేశాయి. కులం కట్టుబాటు ప్రకారం సముద్ర ప్రయాణం చేయరాదు. గతంలో ఒకరు ఆ సాహసం చేస్తే పెద్దలు వెలేశారు. ఇదిలా వుంటే ఇంగ్లాండులో యువకులు మద్యం, మాంసం,మగువ విషయంలో విశృఖలంగా ప్రవర్తిస్తారనే ప్రచార మొకటి ఆ కుటుంబంలో అభ్యంతరానికి ప్రధాన హేతువైంది. చివరికి జైన ఆచార్యుని సమక్షంలో ఇంగ్లాండులో మాంసం, మద్యం, మగువలకు దూరంగా వుంటానికి గాంధీ తల్లికి ప్రమాణం చేశాడు. ఆర్ధికపరమైన ఏర్పాట్లను సోదరుడు తాను చూస్తానని వాగ్దానం చేశాడు. ఓడ ప్రయాణంలోనే గాంధీకి ఇబ్బందులు మొదలయ్యాయి. దుస్తులు, ఆహరపు అలవాట్లు, భాష అంతా కొత్తే. స్కూల్లో, కాలేజీల్లో చదివిన ఇంగ్లీషు స్థాయి చాలటంలేదు. ఇంగ్లాండులో వేసుకోదగ్గ దుస్తులయితే కుట్టించుకున్నాడు కానీ ఖయిత్వాద్ యువకుని బిడియ స్వభావం ఇంకామారలేదు. ఆహర పదార్థాలలో ఏది మాంసాహరమో, ఏది శాఖాహరమో అడగాలంటే బిడియం. అందువల్ల తన క్యాబిన్ లోనే భుజించేవాడు. పళ్ళూ, తీపి పదార్ధాలనే తినేవాడు.అనేక మానసిక వత్తిళ్ళ మధ్య, తల్లికిచ్చిన వాగ్ధానం నిలుపుకొనే ఆత్మస్థయిర్యం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ ప్రయాణం కొనసాగించాడు. జునాగఢ్ కు చెందిన వకీలు ముంజుదార్ తనతోనే ప్రయాణం చేస్తున్నాడు. లాయర్లు పెద్ద నోరు కల్గి వుండాలని అందువల్ల భయం వీడి ఇంగ్లీషులో మాట్లాడడం అలవాటు చేసుకోమని అతను గాంధీకి సలహా ఇచ్చేవాడు.

సాల్డ్ రాసిన "ఫ్లీఫర్ వెజిటేరియనిజం" అనే పుస్తకం గాంధీని బాగా ఆకట్టుకొంది. "శాఖాహరం తీసుకోవటంవల్ల ఆర్ధిక, నైతిక పరమైన లాభాల్ని పొందుతాం ఇది సంపూర్ణాహరం. శాఖాహరుల్లో 90 శాతం మంది మద్యానికి దూరంగా వుంటారు. అందువల్ల ఆహరపు అలవాట్లలో సంస్కరణ మద్యం నిషేధానికి ఊతమిస్తుంది. సాల్డ్ ను గాంధీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే ఆయన రచనల ప్రభావం గాంధీ వ్యక్తిత్వంపై, అలవాట్లపై ఎంతగానో పడింది. శాఖాహర జీవన విధానం ప్రచారకుల్లో మరో ముఖ్యరచయిత అయిన హోలార్డ్ విలియం గాంధీ ని కలిసాడు. పైథాగరస్, ఏసు క్రీస్తు దగ్గర్నుండి నేటి వరకు ఎక్కువమంది తత్వవేత్తలు, ప్రవక్తలు శాఖాహరులే నని విలియంస్ పేర్కొన్నాడు. మద్యం ఖరీదు ఆహరం ఖర్చు కన్నా అధికమని తొలిసారి త్తెలుసుకున్న గాంధీ ఆశ్చర్య పోయాడు. మద్యం కోసం ఎందుకలా డబ్బును వెదజల్లుతారో అర్ధంకాలేదు.

భారతీయులు స్వదేశంలో జరుపుతున్న ఉద్యమానికి బ్రిటన్ లో మద్దతిస్తూ కొన్ని కార్యక్రమాల్ని తొలిసారిగా ఇక్కడి పార్లమెంటు సభ్యులు చేపట్టారు. ఎడ్మండ్ బర్క్, జాన్ బ్రైటో లాంటి వారు వీరిలో ముఖ్యులు. ఇండియన్ పార్లమెంటరీ కమిటీని పునఃప్రారంభించారు. ఇంగ్లాండు పార్లమెంటులో సభ్యుడైన దాదాబాయి నౌరోజి ఈ కమిటిలో ఉన్నాడు. 1892 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండేళ్ళ క్రితం నుండే నౌరోజి ప్రచారం ప్రారంభించాడు. ఈ ప్రచార సభలకు హజరైన గాంధీ దాదాభాయి ఉపన్యాసాన్ని ఏకాగ్రతతో వినేవాడు. పార్లమెంటరీ కమిటీ 1890 ఫిబ్రవరిలో "ఇండియా" పత్రికను ప్రారంభించింది. తర్వాత కాలంలో ఈ పత్రికకు గాంధీ జోహన్స్ బర్గ్ విలేఖరిగా వార్తలు పంపాడు. భారతదేశంలో ప్రజల సమస్యల్ని ఈ పత్రిక వివరించి బ్రిటన్ లో స్థానికుల సానుభూతి కోసం పాటు పడింది. ఇంగ్లాండు వచ్చాకే రోజూ వార్తా పత్రికలు చదివే అలవాటు గాంధీకి అబ్బింది.

మేడం బ్లావట్ స్కీ రాసిన "కీ టు థియొసఫీ" చదివాడు. అయితే ఈ సొసైటీలో చేరవలసిందిగా వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించాడు. బైబిల్ లోని "సెర్మన్ ఆన్ ద మౌంట్" గాంధీని బాగా ఆకట్టుకుంది. ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమని, అందర్నీ ప్రేమించాలని, తోటివారికి ఉపకారం చెయ్యాలన్న క్రీస్తు బోధనలు బాగా ఆకట్టుకున్నాయి. మహమ్మద్ ప్రవక్త జీవితంపై కూడా అధ్యయనం చేశాడు. ప్రవక్తలో ధైర్యం, గొప్పదనం, నిరాడంబరత గాంధీకి వచ్చాయి. యువగాంధీకి అన్ని మతాల సారాన్ని పారద్రోలాలన్న కోర్కె బలపడింది. 1888 నవంబరులో 'ఇన్నర్ టెంపుల్' లో లా అధ్యయనం కోసం చేరాడు. లండన్ విశ్వవిద్యాలయంలో 1890 లో మెట్రిక్ పూర్తి చేశాడు. ప్రెంచ్, లాటిన్, ఫిజిక్స్, సాధారణన్యాయం, రోమన్ చట్టం వంటి అనేక పుస్తకాలు కొని కఠోర శ్రమ చేసి న్యాయవాదిగా డిగ్రీ పూర్తి చేశాడు.

తన దేశం పాశ్చాత్యుల చేతుల్లో పడినందువలన భారతీయులు మరీ దీనావస్థలో పడిపోయారని వాపోయేవాడు. ఏదో వ్యాపారం చేయడానికి భారతదేశం వచ్చిన పాశ్చాత్యులు భారతీయుల మంచితనాన్నిఆసరాగా తీసుకొని శాశ్వతంగా స్థిరపడిపోయి మన సంస్కృతిని, సాంప్రదాయాలను మంటగలుపుతూ, దేశంలోని అపార సంపదలను కొల్లగొడ్తూ వాటిని తమ దేశాలకు తరలిస్తునారని, వారిని వెళ్ళగొడితేనే గాని మనశ్శాంతి ఉండదని తన స్నేహితులతో అనేవాడు. 1901లో గాంధీ భారతదేశంను సందర్శించారు. కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభలకు హజరయ్యడు.1904లో "ఇండియన్ ఒపీనియన్" పత్రిక బాధ్యతను స్వీకరించి తమ ఉద్యమం కోసం దాన్ని మలుచుకున్న గాంధీ భారతీయుల పోరాట విధానానికి మంచి పేరు సూచించమని పాఠకులను కోరుతూ ప్రకటన చేశాడు. గాంధీ బంధువొకరు "సదాగ్రహ" అనే పేరును సూచించాడు. గాంధీ దాన్ని కొద్దిగా మార్పు చేసి "సత్యాగ్రహం" అని నామకరణం చేశాడు.

1906 జులై నుండి గాంధీ బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాడు. జీవితాంతం దీన్ని కొనసాగించాడు. కట్టుబాట్లను ధిక్కరించి సముద్రాయానం చేసి వచ్చిన గాంధీపై కుల పెద్దలకు కోపం పోలేదు. కులస్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం శాంతిస్తే మరో వర్గం ఇంకా ఆగ్రహంతోనే వుంది. వారిని శాంతింప జేయుట కోసం అన్నయ్య మాట కాదనలేక నాసిక్ వెళ్ళి పుణ్యస్నాన మాచరించాడు. గాంధీ ఇదంతా చూశాక కులకట్టుబాట్లు, చాందసపు విధానాలపై గాంధీకి నిరసన భావం కలిగింది. 1860 ప్రాంతంలో టీ, కాఫీ,చెరుకు తోటల్లో పని చేయటానికి భారతీయ కార్మికుల్ని తొలిసారిగా దక్షిణ ఆఫ్రికాకు తీసుకొచ్చారు. 1890 నాటికి 40 వేల మంది కార్మికులు వచ్చారు. వీరంతా అర్ధ బానిసలుగా జీవితాల్ని గడుపుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల తరహలో వీరి జీవితం సాగుతున్నది. క్రమంగా వ్యాపారాలు చేసుకునేందుకు వచ్చి అనేకులు స్థిర పడ్డారు. భారతీయుల మీద ప్రభుత్వం అనేక రకాల ప్రత్యేక చట్టాలు చేసింది. పన్నులు విధించారు. నిబంధనలు, నిషేధాలు చేశారు. స్థానిక శ్వేత జాతీయులు వీరిని హీనంగా చూసేవారు. భారతీయుల్ని కూలీలనేవారు. ఈ అనాగరిక మనస్తత్వాన్ని, నల్లవారి చట్టాల్ని ధిక్కరించాలని గాంధీ నిర్ణయించుకొన్నాడు. మనుషులందరూ సమానమే, అందరికీ ఒకటే న్యాయం, చట్టం ఉండాలి. పాలకులు చేస్తున్న అన్యాయపు పోకడల్ని ఎదిరించాలి.

ఈ ఉద్దేశంతో ప్రిటోరియాలో నివశిస్తున్న భారతీయులతో ఒక సమావేశాన్ని గాంధీ ఏర్పాటు చేశాడు. తమ కష్ట నష్టాల గురించి ప్రభుత్వానికి తెలియజెప్పాలి. భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గాంధీ తన తొలి ఉపన్యాసంలో "వ్యాపారులలో సత్య సంథత అవసరం. మనం విదేశంలో గడిపేటప్పుడు ముఖ్యంగా మన ప్రవర్తన మరింత సత్య నిష్టతో కూడినదై వుండాలి. మనల్ని చూసి భారతీయులంతా ఇంతే అనే ముద్ర పడుతుంది. దక్షిణ ఆఫ్రికాలో నివశిస్తున్న హిందూ, సిక్కు, ముస్లిం, జైన, క్రైస్తవ తదితర మతావలంబకులు మద్రాస్, సింధు, పంజాబు ... లాంటి వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారు సామరస్యంతో సహజీవనం గడపటం అలవర్చుకోవటం అత్యంత ముఖ్యమైన తక్షణ కర్తవ్యం" అని గాంధీ ఉద్బోధించాడు. ఇంగ్లీషు భాష రాని భారతీయులకు భోధించేందుకు సందిగ్దత వ్యక్త పరిచాడు.

బొంబాయి ప్రెసిడెన్సీలోని బౌదా నుండి వచ్చిన పిలుపుమేరకు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. కరువు పరిస్థితుల వల్ల శిస్తు కట్టలేని స్థితిలో వున్న రైతులు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు ఇక్కడ తల్లడిల్లి పోతున్నారు. ప్రభుత్వం అంటేనే రైతులకు భయం ఏర్పడింది. గాంధీ, వల్లభాయ్ పటేల్ కలిసి గ్రామాలు తిరిగి సత్యాగ్రహ సైనికులను తయారు చేశారు. ప్రభుత్వం దీనికి జవాబుగా అన్నట్లు కఠినంగా పన్నుల వసూళ్ళు మొదలు పెట్టింది. కట్టని వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నది. గాందీ నాయకత్వంలో రైతులు దీన్ని శాంతి యుతంగా వ్యతిరేకించారు. సహయ నిరాకరణ చేశారు. చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. శిస్తులు కట్టలేని పేదల్ని వత్తిడి చేయవద్దని ఆదేశాలు వెలువడ్డాయి. రైతులు ఈ వివాదం మీద విజయం సాధించారు. ఎన్నో ఆలోచనలతో నిమగ్నమై వున్న గాంధీజీ బిర్లా మందిరం వద్ద ప్రార్ధన సమావేసంలో వుండగా 1948 జనవరి 20 న బాంబు పేలుడు జరిగింది. ఈ సంఘటన తప్పు దారి పట్టిన యువత చర్యగా మహత్ముడు వ్యాఖ్యానించాడు. మదనలాల్ అనే పంజాబ్ నుండి వచ్చిన శరణాధిని ఈ సందర్భంగా అరెస్టు చేశారు. గాంధీజీ హిందువుల ప్రయోజనాలకు భంగకరంగా తయారయ్యాడనేది కొందరి భావన.

27న దర్గా షరీఫ్ ను దర్శించాడు. గాంధీజీ హిందువులు, ముస్లింలు కలసి కట్టుగా ఉరుసు జరుపుకోవటం పట్ల ఆనందం ప్రకటించాడు. 30వ తేదీన కాంగ్రెస్ భవితపై ఒక డ్రాప్టును టైపు చేయించాడు. కాంగ్రెస్ ను రద్దు చేసి "లోక్ సేవక్ సంఘ్" ను ఏర్పాటు చేయాలని, ఈ అంశం పై చర్చ జరపాలని బాపూజీ అభిలషించాడు.సర్థార్ పటేల్ తో చర్చలు జరిపి సాయంత్రం వేళ బిర్లామందిరంలో ప్రార్ధనా సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న గాంధీజీపై, నాధూరం వినాయక్ గాడ్సెతో అనే హిందూ మతతత్వ వాది తుపాకితో కాల్పులు జరిపాడు." "హేరాం" అంటూ మహత్ముడు నేల కొరిగాడు. అంతకు ముందు బాంబు దాడి జరిగినప్పుడూ ప్రభుత్వము ప్రత్యేక రక్షణ కల్పిస్తానంటే గాంధీజీ అంగీకరించలేదు. సందర్శకుల్ని తనికీ చేసేందుకు కూడా ఒప్పుకోలేదు. వైరిని కూడ ప్రేమించే మహత్ముడు ద్వేషానికి బలయ్యాడు. ఈ వార్త వినగానే దేశ ప్రజలే కాదు, ప్రపంచమంతా నివ్వేరపోయింది. అనేక మంది అశేష అశ్రుతప్త హృదయాలతో కదలిరాగా అంతిమయాత్ర జరిగింది.

1920 డిసెంబరులో నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం సహాయ నిరాకరణ ఉధ్యమానికి అంగీకారం తెలిపింది. భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీ యుగం ప్రారంభమయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీని మహాత్ముడుగా సంభోదించాడు. 1930 ఫిబ్రవరి 15న అహ్మదాబాద్ లో ఉప్పుసత్యాగ్రహం జరిగింది. గాంధీజీ మానవతావదం, ఓర్పు, శాంతి, అహింసా సిద్దాంతాల గురించి ప్రపంచమంతా ప్రచారమయింది. అంతకుముందెన్నడు ఏ రాజకీయనాయకుడు అవలంభించని "అహింసావాదం" ప్రపంచంలోని ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కూడా గాంధీ తన అద్భుత అస్త్రం "అహింస" ద్వారానే తెల్లదొరల కఠిన హృదయాలను కరిగింపచేయగలిగారు. మహిమలు లేకపోయినా, తను నమ్ముకున్న బాట అయిన "అహింస" ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసి "మహాత్ముడిగా" గుర్తింపు పొందిన మహాత్మాగాంధీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

Wednesday, January 13, 2010

భోగి పండుగ--విశేషాలు


చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో భోగి ఒకటి. తెలుగువారి ఇతర పండుగలవలె ఇది తిథి ప్రధానమైన పర్వం కాదు.ఈ పండుగ దక్షిణాయనానికి ఆఖరురోజు,అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజు.

రైతులకు పంటలన్నీ ఈ పండుగ నాటికి దాదాపు ఇంటికి వచ్చేస్తాయి.రైతులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి దొరుకుతుంది.చేతికొచ్చిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలుకలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి అని వచ్చిందేమో ! భోగికి ఆ పేరు రావడానికి ఇంకో విధంగా గూడా చెబుతారు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ లో విష్ణుచిత్తుడు అనే పరమ భాగవతోత్తముడు, ఆయనకు తులసివనంలో లభించిన గోదాదేవి అనే కూతురు.గోదాదేవి శ్రీరంగంలోని శ్రీరంగనాథున్ని తప్ప మానవమాత్రులెవరినీ వివాహం చేసుకోనని తండ్రితో చెప్పింది.

తన కోరికను నెరవర్చుకోవడానికి ద్వాపరంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికలు నోచిన కాత్యాయనీ వ్రతం మాదిరి తను కూడా చేయప్రారంభిస్తుంది.ఆమె రోజుకొక పాశురంతో(పద్యం) స్వామిని అర్చించేది.తర్వాత నివేదన చేసేది.ఆ మాసం రోజులు నెయ్యిని,పాలను వర్జించి పొంగలిని మాత్రమే స్వీకరించేది.అలా నెలరోజులు ముప్పై పాశురాలతో అర్చించింది. ఆ ముప్పై పాశురాల గ్రంథామే "తిరుప్పావై" .

తిరుప్పావై రచన పూర్తి అయిన ముప్పైయ్యవనాడు శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని ఆమెకు మాట ఇస్తాడు.శ్రీరంగం రావలసినదని ఆహ్వానిస్తాడు. గోదాదేవి తనకు భగవంతుడు చెప్పిన మాటను తండ్రికి చెప్పి తండ్రితో శ్రీరంగం చేరుకుంటుంది. అశేష ప్రజానీక సమక్షంలో ఆమెను శ్రీ రంగనాథునకిచ్చి వివాహం జరిపిస్తారు. వివాహ కార్యక్రమం పూర్తికాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్ళి స్వామి వారి శేషతల్పం ఎక్కి స్వామివారి పాదాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది.

ఇంతటి మహిమగల విషయం జరిగిన పుణ్యదినం ,పండుగదినం భోగి. గోదాదేవికి అంతటి భోగభాగ్యం కూర్చిన ఆనాడు అప్పటినుంచి జనసామాన్యానికి కూడా సమస్త భోగభాగ్యాలు ఇచ్చేరోజు భోగి పండుగ అయింది.

వామనమూర్తి పాదాల క్రింద బలి చక్రవర్తి అణగిన దినంగా కొందరు చెబుతారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో వామన నామ స్మరణము,బలి చక్రవర్తి ప్రస్తుతి చేయడం ఆచారంగా ఉంది.

భోగినాడు తెల్లవారుఝామునే చేచి, అభ్యంగన స్నానం చేయాలి. చంటిపిల్లలకు భోగిపీడ తొలగడానికి కేవలం తలంటుతోనే గాక మధ్యాహ్నం భోగిపళ్ళు కూడా పోస్తారు.ఈ భోగిపళ్ళు పోయడమన్నది పిల్లలకు దృష్టి పరిహారార్థం చేసే కర్మగా కనిపిస్తుంది.

చిన్నపిల్లలకు కొత్తబట్టలు తొడిగి పీట మీద కూర్చోబెడతారు.రేగుపళ్ళు, పైసలు,చెరకు ముక్కలు, బంతిపూలు కలిపి తలమీదనుంచి పోస్తారు.ఇలా చేయడంవల్ల ఆ పిల్లలకు ఆయుర్వృద్దికరమై ఉంటుందని తెలుగు తల్లుల నమ్మిక.
భోగినాడు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ధనుర్మాసం నెలరోజులు ఆడపిల్లలు ముగ్గుల్లో పెట్టిన గొబ్బెమ్మలను,ఇంటిలోని పనికిరాని వస్తువులను వేస్తారు.

Thursday, January 7, 2010

జీవితం అసంతృప్తిగా వుందా?



.




ఇంతకంటే సంతోషకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం










మనల్ని పలకరించేవారు కనీసం ఒకరిద్దరైనా ఉన్నారు.











మన రోడ్లు ఇంత అధ్వాన్నంగా అయితే లేవు.











మన జీవితం ఈ అవ్వ కంటే దారుణంగా అయితే లేదు కదా?


మరి మనం ఎంత అదృష్టవంతులం?

ముఖ్య అనుభందం:
http://jeevani2009.blogspot.com

Tuesday, December 29, 2009

చిత్ర లోకం @ తెలంగాణ

మీకో దండం. ఇక తమరు పెద్దాపురం కానీ,చిలకలూరిపేట కానీ వెల్లండి.

ఆంధ్రా ,తెలంగాణా కాకులు.


జోడు గుర్రాలపై స్వారీ...!


నా సీటుకే ఎసరు పెడదామనుకున్తున్నావా ...!


వందా... నా బొందా...!

ముఖ్యమంత్రి రోశయ్య గారు అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఈ మద్యనే వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.


ముక్కలు చెక్కలు

రాష్ట్రాన్ని చేస్తే అయిదు ముక్కలు చేయండి లేదంటే ఒక్కటిగా ఉంచండి అంటూ సీమ,ఆంద్ర MLAలు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. కొంత మంది నాయకులు ప్రత్యెక తెలంగాణ కావాలంటే మిలిగిన వాళ్లు నెల్లూరు ,ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలంటున్నారు. కొంతమంది హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, మరికొంతమంది విశాక రాజదానిగా కళింగ ఆంద్ర కావాలని అడుగుతున్నారు. పాపం గుంటూరు,కృష్ణా,ఉభయ గోదావరి జిల్లాలు ఎవరికీ వద్దంట. ఈ జిల్లాలను కలిపి ఐదో రాష్ట్రం చేస్తే సరిపోతుంది.
ఈ MLAల రాజీనామాల తో రాష్ట్రంలోని అన్ని పార్టీలలో సంక్షోభం వచ్చి పడింది.ప్రభుత్వం వుంటుందో ఊడుతుందో అర్ధం కాని పరిస్థితిలో ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.రోజు బంద్ లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బంద్ ల వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా. ఈ బంద్ ల వల్ల ఆర్టీసీ ,విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఎన్నాళ్ళు బంద్ లు కొనసాగిస్తారు.మరోవైపు మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి రాజీనామాలు చేస్తామంటున్నారు. సోనియా పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది. హైకోర్టు లో న్యాయవాదులు వాదులాడుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆమరణ నిరాహారదీక్ష పెద్ద ప్యాషన్ ఐపోయింది. ప్రతివాడు దీక్షలు చేసేవాడే.
మన లగడపాటి గారి వాదన ఏమిటంటే సమైక్యంగా ఉంటే ఎక్కువ మంది లను పార్లమెంటు కు పంపితే ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చని.మరి ఇప్పుడు ముప్పయికి పైగా ఎం.పి. లు ఉంది ఎన్ని నిధులు తెచ్చారో.ఈయన గారు మనకు రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరిగినప్పుడు,వరదసాయం లో అన్యాయం జరిగినప్పుడు ఏమిచేస్తున్నారు.ఇలాంటి ఎం.పి. లు ముగ్గురు ఉన్నా మూడు వందలమంది ఉన్నా ఒరిగేది ఏమిలేదు. అందరు అన్ని పంచుకోగా మిగిలిన ఏదో ఒక పనికిమాలిన మంత్రి పదవి పడేస్తే అదే మహాభాగ్యమని మన కాంగ్రెస్ ఎం.పి. లు సంబరపడిపోతారు. వీళ్ళు మనకి నిధులు తీసుకువస్తారా.
ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామా. రాష్ట్రం లో జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి,అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఇలా ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడిప్పుడే బలపడుతున్న తే.దే.పా. ను చీల్చడానికి పన్నిన ప్లాను ఇది. దీనివల్ల పాపం ప్రజలలో ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు.జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సొంత పార్టీ లో MLAలు ఎంత గోల చేసినా అందరిని అణచివేసిన సోనియా కే.సి.యార్. కు లొంగుతుందా. అయితే ఎత్తు కు చంద్రబాబు షాక్ తిన్నాడు.పార్టీ వాళ్లు రెండుగా విడిపోతున్నారు.తెలంగాణ పై వెనక్కు తగ్గితే మేము కూడా రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఆలస్యంగానైనా తేరుకున్న బాబు కోస్తా,సీమ ఎం.ఎల్.. లను రాజీనామాలు ఆమోదించాలంటూ స్పీకరుని డిమాండ్ చేయిస్తున్నాడు, తెలంగాణా ఏం.ఎల్.ఎ లను కూడా ఉద్యమాలు చేయాలని చెప్తున్నాడు. విదంగా ముందుకు పోవడం వల్ల కాంగ్రెస్ ఎం.ఎల్. లను డిఫెన్స్ లో పదేయ్యోచ్చునని బాబు గారి ఆలోచన కాబోలు. ఏది ఏమైనా ఏది ఒక సస్పెన్స్ సినిమా క్లైమాక్సు చూస్తున్నట్టుగా ఉంది. మరి ముగిపు ఎలా,ఎప్పుడు ఉండబోతుందో నాకు అర్ధం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

Saturday, December 19, 2009

సలీమ్ (మూవీ రివ్యూ)

saleem

తెలుగువన్‌ రేటింగ్‌ - 2.5/5
బ్యానర్ - శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
స్టోరీ, స్క్రీన్‌ప్లే ,డైరెక్షన్ - వైవిఎస్ చౌదరి
ప్రొడ్యూస్డ్ - డాక్టర్ మోహన్ బాబు.
మ్యూసిక్ డైరెక్టర్ - సందీప్ చౌతా
సినిమ్యాటోగ్రఫీ – సి. రామ్‌ప్రసాద్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావు
ఆర్ట్ – ఆనంద్ సాయి
ఫైట్స్ – కనల్ కణ్ణన్
లిరిక్స్ – చంద్రబోస్‌
రిలీజ్‌ డేట్‌ – 12-12-2009

కాస్ట్:

మోహన్ బాబు, విష్ణు, భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వేణు మాధవ్ నెపోలియన్, జయప్రకాష్ రెడ్డీ, ముఖేష్ ఋషి, రాహుల్ దేవ్, జీవ, తెలంగాణా శకుంతల, హేమ, మాస్టర్ భరత్ అండ్ అదర్స్…

కథ
యూరప్ నుండి సత్యవతి (ఇలియానా) తన తల్లిదండ్రులు చెప్పిన రోజుకంటే ఒక రోజు ముందే ఇండియాకు తిరిగి వస్తుండగా ఆమెను అప్పలనాయుడు (ముఖేష్ఋషి) తమ్ముడు చంటి చంపాలని ప్రయత్నిస్తాడు. అతని బారి నుండి మున్నా (విష్ణు) ఆమెను కాపాడటమే కాకుండా సత్యవతితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మున్నా సత్యవతిని చంపడానికి ప్రయత్నించింది ఎవరు అని అడుగుతాడు సత్యవతి తండ్రి సింగమనాయుడుని. వాడి గురించి మున్నాకు వివరించిన సింగమనాయుడు వెంటనే సత్యవతికి పెళ్ళిచేయాలని యూరప్‌లో వున్న తన ఫ్రెండ్‌కి చెప్పగానే అతను ఒక మంచి సంబంధం వుంది నేను పంపిస్తున్నాను వారు సత్యను చూడటానికి వస్తున్నారు అని వివరిస్తాడు.
సత్యను చూడటానికి వస్తున్న యూరప్‌ పెళ్ళివారిని అప్పలనాయుడు హతమార్చి వారి ప్లెస్‌లో వేరేవారిని పంపిస్తాడు. సత్యను చూడటానికి పెళ్ళివారు వస్తున్నారు అని తెలుసుకున్న మున్నా సత్యను ఒక గదిలో బందించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ పెళ్ళి నాకు ఇష్టంలేదని చెప్పు.. లేక పోతే నేనే ఈ పెళ్ళి చెడగొడతాను అని అంటాడు. సత్యవతి మాత్రం తనకు పెళ్ళి కొడుకు నచ్చాడు పెళ్ళిచేసుకుంటాను అని తన ఫ్యామిలీతో చెబుతుంది.
ఇక పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మున్నా మాత్రం వచ్చిన పెళ్ళివారి గురించి ఎంక్వయిరీ చేసి వారు యూరప్ పెళ్ళివాళ్ళు కాదని వాళ్లు అప్పలనాయుడు మనుషులని తెలుసుకొని వారిని చంపేసి సింగమనాయుడు ఫ్యామిలీ జోలికి ఇక రావద్దని అప్పలనాయుడికి వార్నింగ్‌ ఇస్తాడు. ఇక మున్నా తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకున్న అప్పలనాయుడు అడుగడుగునా తన కూతుర్ని కాపాడుతున్న మున్నాకే సత్యని ఇచ్చి పెళ్ళిచేయాలని నిర్ణయించి వారిని ఆ గ్రామంలో వున్న గుడికి తీసుకువెళ్ళగా ఆ గుడి నుంచి కొంతమంది రౌడీల సహాయంతో సత్యవతి యూరప్‌ పారిపోతుంది. సత్యవతి తన ఫ్యామిలీ చేస్తున్న పెళ్ళి నుంచి యూరప్ ఎందుకు పారిపోయింది? మున్నా సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..
వై.వి.ఎస్‌. చౌదరి, మోహన్‌బాబు, విష్ణువర్థన్‌ బాబుల కాంబినేషన్‌లో సినిమా అంటే ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగానే పెరిగాయి. అయితే వారి ఎక్స్‌పెక్టేషన్‌కి ఏమాత్రం అందుకోలేకపోయాడు ఈ సలీమ్‌. మోహన్‌బాబు లాంటి మంచి నటుడుని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఆయన పాత్ర స్వభావం, తీరు చిత్రీకరించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. ఫస్టాఫ్‌ అంతా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో సాఫీగానే సాగిపోయిన చిత్రం సెకండాఫ్‌కి రాగానే ప్రేక్షకుల ఊహలకి అందని రీతిలో చతికిలపడిపోయింది. కథ, కథనంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు మరికొంత కసరత్తు చేసుంటే బావుండేది.

నటన-: ఈ చిత్రంలో మున్నాగా మంచు విష్ణు చాలా చక్కగా నటించాడు. తన బాడీలోనే కాదు తన నటనలో కూడా చాలా మార్చు వచ్చింది. డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో బాగా ఇంప్రెసివ్‌గా కనిపించాడు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించిన మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ క్యారెక్టర్‌ చేసినా దానికి న్యాయం చేయడం ఆయన నైజం. ఇక అందాల ముద్దుగుమ్మ ఇలియానా విషయానికి వస్తే… సత్యవతి క్యారెక్టర్‌లో చాలా అద్బుతంగా నటించింది.
ఫోటోగ్రాఫీ-: బాగానే వుంది.
సంగీతం -: సందీప్‌ చౌతా ఈ చిత్రానికి అందించిన సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా రీమిక్స్‌ సాంగ్‌ “పూలు గుస గుస లాడేనని..” అనే సాంగ్‌ చాలా బాగుంది.

ఎడిటింగ్‌ -: ఇంత పెద్ద సినిమాని ఎంతని ఎడిట్‌ చేస్తాడు ఏ ఎడిటరయినా. ఉన్నంతలో ఎడిటింగ్‌ బాగుంది.


ఏది ఏమైనా ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఆనందించవచ్చును.