Friday, January 30, 2009

తెర్రొరిస్త్స్ తడక?


నవంబరులో (26/11) టెర్రరిస్టుల దాడికి బలయిన వాళ్ళు అతికొద్ది మంది. కానీ స్పందించినవాళ్ళు మొత్తం దేశప్రజలందరూ. ఇప్పుడు 3 రోజుల నుండి దేశం మొత్తం ఆయిల్ కంపెనీ సిబ్బంది సమ్మె ధాటికి అతలాకుతలం అయిపోతే బ్లాగ్లోకం లో కానీఇతరత్రా కానీ కనీస స్పందన లేదు. బహుశః టెర్రరిజం అంటే తుపాకులూ, బాంబులూ అని మనకున్న అవగాహన వల్ల అయుండచ్చు. నా దృష్ఠిలో బాంబులూ తుపాకుల వల్ల కొద్దిమంది, కొన్ని ప్రాంతాల్లో బాధ పడతారు. కానీ ఈ ఆయిల్ సిబ్బంది సమ్మె వల్ల ఈవేళ ఎంత మంది కష్టపడ్డారో ఎవరికీ అంత తెలియదు. అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే రక్తాలూ, గాయాలూ, ఓవర్ టు తాజ్ బ్లడీ కవరేజ్ లూ ఉండవు కదా. ఆటోలు లేవు, టాక్సీలు లేవు, కాంట్రాక్టు బస్సులు లేవు. చివరికి పబ్లిక్ రవాణా ఎన్ని రోజులు నడవగలదో తెలియదు. పెట్రోలు లేక పోతే పోనీ, సెలవు పెట్టుకుని ఇంట్లో కూచోవచ్చనుకుంటే (రోజు కూలీలకి ఆసౌకర్యం కూడా లేదు) , కొన్ని ప్రాంతాల్లో కనీసం వంటగ్యాసు (పైప్ డ్) రాలేదుట. 3 రోజులు ఇలాంటి పరిస్తితి ఉంటే ఎంత ఆర్ధిక నష్టం, అసౌకర్యం కలిగుంటుందో మీ అవగాహనకి అందని విషయం కాదు. టెర్రరిష్టుల అటాకే బెటరు, అదృష్టం బాగుంటే తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమ్మెలలో ఆఛాన్సే లేదు.
ఈవిషయం చర్చిస్తుంటే ఒకాయన వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ మాటఎవరూ వినరు కాబట్టి సమ్మె ఓకే. ఏసీ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళం ఇంతకన్నా దూరాలోచన చేయలేమేమో!

ఒబామా మరో cherithra రాసాడు ........

You may have winning ideas. But you need much more to win the game.
ఒబామా గెలిచిన సందర్భంలో వెల్ష్ (Jack and Suzy Welch) తను రాసిన Barack Obama's Victory: Three Lessons for Business - అన్న వ్యాసంలో ఒబామా గెలుపు, మెకెయిన్ ఓటముల నుండి వ్యాపారస్తులు నేర్వగల 3 సూత్రాలు వెలికి తీసారు..
అవి –
స్పష్టమైన, నిశ్చితమైన దార్శనికత.
కార్య నిర్వహణ – అనుకున్నవి ఆచరణలో పెట్టడం.
మనకి అనుకూలురైన, మంచి స్థాయిలలో ఉన్న స్నేహితులు

ఏది ఏమైనా గెల్చినవాడే మొనగాడు.
ఒబామా ఏదో చేసేస్తాడు, ప్రపంచాన్ని మార్చేస్తాడని ఆశించక్కరలేదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోయే స్థితి దాటిపోతే సుఖం.

Wednesday, January 28, 2009

నిజంగా ఒక్క వ్యక్తి లా జీవితంలూ ఫై కి రావాలో తెలుసుకోవాలని ఉందా?.....

.

.

.

.

.

.

.
ఒక్క నీముశం !

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.


మన నారాయణ్ మూర్తి ఎలా ఇంఫోస్య్స్ ఫై కి వచ్చారూ?

.

.

.

.

.

.

.

.

.

Saturday, January 24, 2009

చరిత్రకేకిన చరిత్ర కారులు

డౌన్లోడ్ చేయండి

మీ పుట్టిన తేది మీ జీవితం


డౌన్లోడ్ చేయండి:

జనువులు





జన్యువుల ఆత్మహత్య



ఆధునికమానవుడు మామూలుగా పాటిస్తున్న ఆరోగ్య సూత్రాలవల్ల మనిషి సగటు ఆయుర్దాయం అంతకంతకూ పెరుగుతోంది. నూరేళ్ళు పైబడినవారు ఒక్క జపాన్‌లోనే 20 వేలమంది ఉన్నారట

ఎటొచ్చీ జీవకణాల స్థాయిలో జరుగుతున్న కొత్త పరిశోధనలు ముసలితనం, చావు వగైరాల రహస్యాలను వెల్లడిస్తున్నాయి. "నొసటి రాత" నొసటిమీద కాక అతిసూక్ష్మ జీవకణాల్లో నిక్షిప్తమై ఉందనడంలో సందేహం లేదు. ఇదంతా ఈనాడు కనబడుతున్న ప్రాణులు ఆవిర్భవించడానికి ఎంతో ముందుగానే జరిగిన వ్యవహారం. ప్రాణుల కన్నా జీవకణాలూ, వాటి నిర్మాణమూ చాలా పురాతనమైనవని గుర్తుంచుకోవాలి. ప్రాణుల శరీరాలన్నీ మిల్లిమీటర్‌లో వెయ్యోవంతు పరిమాణం కలిగిన కణాలతో కూడుకున్నవి. వీటిలో ప్రధానంగా నైట్రొజన్‌, ఆక్సిజన్‌, కార్బన్‌, హైడ్రొజన్‌ అణువు లుంటాయి.



జీవకణాల్లోని ముఖ్యభాగం మరింత సూక్ష్మమైన కేంద్రకం, లేక న్యూక్లియస్‌. మొత్తం కణానికున్నట్టే దీనికీ బయట ఒక పొర ఉంటుంది. దానిగుండా అవసరమైన పదార్థాలు సరఫరా అవుతూంటాయి. ప్రాణి లక్షణాలను మొత్తంగా నిర్వచించే క్రోమొసోమ్‌లు ఈ న్యూక్లియస్‌ లోపలే ఉంటాయి. క్రోమొసోమ్‌లలో డిఎన్‌ఏ (డి ఆక్సీ రైబో న్యూక్లియిక్‌ ఆసిడ్‌) అనే క్షార పదార్థపు కణాలుంటాయి. ఇవి మెలికలు తిరిగిన త్రాటి నిచ్చెనలాగా రెండు ఒకేలాంటి పోగులు కలిసిఉన్న గొలుసులు. అతి పొడవైన ఈ గొలుసుల్లోని భాగాలను జీన్స్‌ అంటారు. వీటిలో నాలుగే నాలుగు రకాల పదార్థాలు (A అడినీన్‌, G గ్వానీన్‌, C సైటొసీన్‌, T థైమీన్‌ అనేవి) రకరకాల క్రమంలో వరసగా పేర్చబడి ఉంటాయి. శక్తివంతమైన మైక్రోస్కోప్‌లో తప్ప కనబడని సూక్ష్మస్థాయిలో మన జీవితాలకూ, ఆరోగ్యానికీ, మృత్యువుకూ కారణమైన ప్రక్రియలన్నీ జరుగుతూంటాయని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. క్రమంగా చావుకు దగ్గరయే ప్రాణుల శరీరాల్లో జన్యువుల పాత్ర ఏమిటో పరిశీలించినప్పుడు కొన్ని జన్యువుల పనల్లా కేవలం టైం బాంబులాగా పనిచేసి చావుకు దారి తీయడమేనని తెలిసింది.



జీవకణాలు తరుచుగా నాశనమవుతూ, మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉండడం మామూలే. పునరుత్పత్తికై ఈ చీలిక జరగబోతున్నప్పుడు కణం రెండింతలై కేంద్రకాల్లోని డీఎన్‌ఏ గొలుసులు రెండుగా చీలిపోతాయి. డీఎన్‌ఏలోని క్రోమొసోమ్‌ పోగు చీలుతుంది. ఈ క్రోమొసోమ్‌ కొసలను టెలొమీర్‌ (telomere) అంటారు. క్రోమొసోమ్‌ కొసలను ఒకదానికొకటి అతుక్కు పోకుండా కాపాడే ఈ టెలొమీర్‌ అనే డీఎన్‌ఏ అణువులు కొసలకు టోపీలవంటివి. ఇవి లేకపోతే క్రోమొసోమ్‌లకు ప్రత్యేకత ఉండదు. అతుక్కుపోయిన క్రోమొసోమ్‌లు కణవిభజన సమయంలో విడివడలేవు. పెనవేసిన రెండుపేటల దారం అంచులను అతికిఉంచే జిగురు కరిగిపోయినప్పుడు దారాలు వేరయినట్టుగా ఈ మార్పు జరుగుతుంది. అందుచేత టెలొమీర్‌లు లేని జీవకణం సరిగ్గా పనిచెయ్యదు. చీలిక జరిగినప్పుడల్లా ఈ పోగుల తోకలు పొట్టివవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా జరిగాక రానురాను ఈ తోకలు మిగలకుండాపోతాయి. అప్పుడు పునరుత్పత్తి నిలిచిపోతుంది. కొందరు దీన్ని షూలేస్‌ తాళ్ళకు ఉండే చిన్న ప్లాస్టిక్‌ టోపీలతో పోల్చారు. అవి ఊడిపోతే లేసుల అంచుల పోగులు బైటపడి అవి పాడయే అవకాశం ఉంటుంది. టెలోమీర్‌ల విషయంలో దాదాపుగా అలాగే జరుగుతుంది.



యవ్వనంలో ఈ పోగుల కొసల్లో 20 వేల క్షారకణ జంటలున్న జీవకణాలు వయసు పెరిగి రెండుగా చీలినప్పుడల్లా ఈ పోగుల అంచుల్లోని సుమారు వందేసి కణాలు తగ్గుతూంటాయి. క్రమంగా వాటి సంఖ్య 5 వేలకు పడిపోతుంది. అలా వయసుమళ్ళిన కణాలు కొంతకాలం బతుకుతాయిగాని విభజన చెందలేవు. అవి ఆక్సిజన్‌ ప్రభావంవల్ల పాడవుతాయి. డీఎన్‌ఏ రిపేర్లు సరిగ్గా జరగవు. ధమనులవంటి ముఖ్య శరీరభాగాల్లో జీవకణాలకు ఇటువంటి హాని కలిగితే మరణం తప్పదు. ఎందుకంట� ధమనుల, రక్తనాళాల గోడలు పెళుసెక్కడం వంటివి జరిగినప్పుడు ప్రాణాపాయం ఎక్కువౌతుంది. టెలొమీర్‌ తోకలు తరిగిపోతున్న కొద్దీ ముసలితనానికీ, శరీరహానికీ అవకాశాలు పెరుగుతాయి. వయసుమళ్ళినవారికి ఈ టెలోమీర్లు పొట్టివవుతున్నప్పుడు మరణించే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని ఊహిస్తున్నారు. అది అంటురోగాలవల్ల కావచ్చు, హార్ట్‌అటాక్‌వల్ల కావచ్చు. పుట్టినప్పుడు ఈ టెలోమీర్ల పొడుగు అందరిలోనూ సమానంగా ఉండదట. ఆరోగ్యవంతుల్లో వయసు పైబడినదాకా ఇవి పొట్టివి కావు. దీన్ని 1961లో మొదటగా ప్రతిపాదించినవాడు లియొనార్డ్‌ హేఫ్లిక్‌. వివిధ జంతుజాతుల్లో ఆయుప్రమాణం వేరుగా ఉంటుందని ఇతను నిరూపించాడు. కింది బొమ్మల్లో ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, టెలోమీర్‌ (T), న్యూక్లియోటైడ్‌లూ (N) చూపబడ్డాయి. టెలోమీర్‌ల నిర్మాణంలో A, C, T, G జన్యువులుంటాయి.









కణాల ఆత్మహత్యకు దారితీసే ఈ మార్పులు జరగకుండా ఆపగలమా? కణవిభజనకు హేఫ్లిక్‌ ప్రతిపాదించిన పరిమితి గురించిన తరవాత జరిగిన పరిశోధనల్లో టెలోమరేస్‌ అనే ఎన్‌జైమ్‌ ఒకటి ఉన్నట్టు తెలిసింది. ఇది ఉత్పత్తి అవుతే టెలోమీర్‌ అనబడే కొసలు తరిగిపోవు. మామూలుగా కణాల్లో తోకలు పెరగడానికి పనికొచ్చే ఈ టెలోమరేస్‌ ఉంటుంది కాని నిద్రాణస్థితిలో ఉంటుంది. ఇది గనక చురుకుగా పనిచేస్తే వార్థక్యం రాకపోవచ్చు. స్త్రీపురుష కణాల సంయోగం జరిగినప్పుడు మాత్రమే ఈ పదార్థం మళ్ళీ తయారై, తోకలు పూర్తి స్థాయికి పెరుగుతాయి. మళ్ళీ కణవిభజన జరుగుతున్నప్పుడు ఇవి క్రమంగా పొట్టివయిపోతూంటాయి. దీన్నిబట్టి చూస్తే సంతానోత్పత్తి ద్వారా జాతిలో వైవిధ్యం కొనసాగడం తప్పనిసరి అనే ఆంక్ష ప్రకృతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. పరిసరాల్లో నిరంతరం జరిగే మార్పులకు తట్టుకోవడానికి జన్యువుల స్థాయిలో మార్పులు ప్రకృతి "దృష్య్టా" అత్యవసరం. అందువల్ల ముసలితనం, చావు అనేవి ప్రకృతిపరంగా "విధి విధానం" అనిపిస్తాయి. ఏమైనప్పటికీ అంతకంతకూ తరిగిపోయే ఈ తోకల వ్యవహారం ప్రాణికి ముసలితనానికీ, హానికీ దారితీస్తుందనేది నిజమే. అరుదుగా, శరీరరక్షణకు ఉపయోగపడే తెల్ల రక్తకణాలవంటివి తయారవుతున్న సందర్భాల్లో అప్పుడప్పుడూ టెలోమరేస్‌ తయారవడం కద్దు. ఎందుకంటే రోగక్రిములను అడ్డుకోగలిగిన తెల్ల రక్తకణాల పునరుత్పత్తికి అవరోధం కలిగితే శరీరం రోగాల పాలవుతుంది.



460 కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన భూగోళం మీద 300 కోట్ల సంవత్సరాల కిందటే తొలి జీవకణాలు ఆవిర్భవించాయి. వాటి లక్షణాలూ, లోపలి నిర్మాణాలూ ప్రస్తుత రూపాన్ని చేరుకోవడానికి ఊహించరానంత ఎక్కువ సమయం పట్టింది. చుట్టూ ఉన్న పరిస్థితులకు తట్టుకుంటూ తమ మనుగడనీ, సంతానోత్పత్తినీ కొనసాగించడానికి విజయవంతంగా ప్రయత్నించిన ఈ కణాల ఫార్ములాకు తిరుగులేదు. పునరుత్పత్తికి జీవకణాలు ప్రస్తుతపు ఆత్మహత్య పద్ధతిని "ఎన్నుకున్నా యంటే" జీవపరిణామ క్రమంలో తక్కిన పద్ధతులకన్నా ఇదే బలంగా నిలవగలిగిందని ఊహించాలి. ఇది ప్రకృతిసిద్ధంగా "అతీత శక్తుల" ప్రమేయమేమీ లేకుండా జరిగిన పరిణామం.




























ముసలితనం

లక్షణాలు:





పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు. సమాజంలో సమష్టి భావన నానాటికీ తగ్గి, మనిషి ఒంటరిగా పుట్టి, ఒంటరిగానే పోతాడనే "వేదాంత" ధోరణి పెరగడంతో ప్రజల సామాజిక దృక్పథం కొంతవరకూ మార్పుచెంది తీరుతుంది. ఇది చాదస్తమనేది మనకు తెలుసు. అలాంటప్పుడు శాస్త్రవిజ్ఞానపరంగా మనకు ముసలితనం, చావు వగైరాల గురించిన వివరణ ఎటువంటిదో కొంతవరకైనా తెలుసుకోవడం లాభిస్తుంది.
వేదాంతుల మాట ఎలా ఉన్నా కాలంతోపాటు మన శరీరాల్లో కలిగే మార్పుల గురించిన పూర్తి అవగాహన ఈనాటికీ లేదనే చెప్పాలి. అయినప్పటికీ సైన్స్‌ దీన్ని గురించి చాలా విషయాలు వివరించగలదు. వయసుమళ్ళిన మానవశరీరాలు ఎలాంటి మార్పులు చెందుతాయో, జీవకణాల్లో ఎటువంటి పరిణామాలు కలుగుతాయో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఆధునిక శాస్త్ర పరిశోధనల ద్వారా తెలియవస్తోంది.
పుట్టిన ప్రతి మనిషీ మామూలుగా కొంతకాలానికి ముసలివాడై చనిపోతాడు. ముందుగా ముసలితనపు లక్షణాలేమిటో చూద్దాం. వయసుతోబాటు శరీరం పటుత్వం కోల్పోతుంది. ఎముకలు పలచబడతాయి. చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. గాయాలు త్వరగా మానవు. యవ్వనంలో లాగా జీవకణాల పునరుత్పత్తి జరగదు. శాస్త్రవేత్తలు వీటికిగల భౌతిక కారణాలకై ప్రతి జీవకణం కేంద్రకంలోనూ ఉన్న జన్యువుల్లో వెతకడం ఆరంభించారు. ఈ డిటెక్టివ్‌ పని ఇంకా కొనసాగుతూనే ఉన్నా కొన్ని విశేషాలు కాస్తకాస్తగా బైటపడుతున్నాయి. ఏడుగురు గుడ్డివాళ్ళూ, ఏనుగూ చందంగా రకరకాల కోణాలనుంచి ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. కేవలం కారణాలు తెలుసుకోవడంకాక చికిత్సకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆరోగ్యంగా ఉందామని ఎంత ప్రయత్నించినా, వయసుతో మన శరీరాలు కాస్తకాస్తగా శిథిలమవుతూ కొన్నాళ్ళకి నశిస్తాయనేది మనకి తెలిసి, మనని బాధించే సత్యం. ఇది ప్రాణుల ప్రాథమిక లక్షణంలాగా కనబడుతుంది. ఎందుకంటే 50కోట్ల సంవత్సరాల క్రితం రూపొందిన ప్రాణుల్లో కూడా ఇలాగే జరిగిందని శిలాజాల పరిశోధనల్లో తేలింది.
మొదట్లో ముసలితనంవల్ల పటుత్వం తగ్గడం అనేది వాడకంవల్ల కత్తులూ, కటార్లూ మొక్కపోవడం వంటిదనే అనుకునేవారు. కాని పంతొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో ఉష్ణగతి శాస్త్రం (thermodynamics) సూత్రాల ప్రతిపాదన జరిగాక ఈ భావన సడలింది. అందులోని రెండో సూత్రాన్నిబట్టి చూస్తే శిథిలంకావడం, తుప్పుపట్టడంవంటివి నిర్జీవపదార్థాల్లోనూ, వ్యవస్థల్లోనూ జరుగుతాయి కాని, ఆహారం తిని, పెరిగే జీవజాలంలో జరగవని తేలింది.
మన శరీరాల్లో జరిగే దీర్ఘకాలిక, తక్షణ పరిణామాలన్నిటినీ జీవకణాల స్థాయిలో అర్థం చేసుకోవడం మొదలయింది. జీవరాశి మొదట ఏకకణజీవుల రూపంలోనే ప్రారంభమైందనేది తెలిసినదే. అనేక ఏకకణజీవాలు ఒక తుట్టెలాగా ఏర్పడి మనుగడ సాగించడంలో ఎక్కువ ప్రయోజనం కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని ప్రత్యేక బాధ్యతలు చేపట్టడంతో అవి ఒకే పెద్ద బహుకణజీవికి వేరువేరు అవయవాలుగా రూపొంది ఉంటాయి. ఆ విధంగా మొదలైన బహుకణ జీవులు ప్రాచుర్యం చెంది అనేక రూపాలను సంతరించుకున్నాయి. అయినా వాటి శరీరాల్లోని వివిధ కణసముదాయాల మధ్య మంచి సమన్వయం ఉండడం చాలా అవసరం. ఒక వ్యవస్థలో తలెత్తే లోపాలు తక్కినవాటి మీద తీవ్రమైన ప్రభావం కలిగించగలవు. వ్యవస్థకు తగిలిన దెబ్బ మరీ పెద్దదయితే ప్రాణి చచ్చిపోతుంది.
స్థూలంగా చెప్పాలంటే అనియత (random) క్రమంలో ఉండే కణాలన్నీ ప్రాణుల శరీరాల్లో చేరగానే "సజావుగా" అమరి తమ పనులను "సక్రమంగా" నిర్వర్తిస్తాయి. అంతేకాదు. అవసరమైనప్పుడు విరిగిన ఎముకలు అతుక్కోవడం వగైరా చర్యలద్వారా తప్పులు సరిదిద్దుకుంటాయి కూడా. మళ్ళీ ఇందులోనూ అన్ని జంతువులూ ఒకటిగా లేవు. క్షీరదాల్లో ఇలాంటివాటికి పరిమితులుంటాయి. ఉదాహరణకు మన వేలి చర్మం గాటుపడితే బాగవుతుంది కాని, వేలే తెగిపోతే మరొకటి మొలవదు. కొన్ని జలచరాల్లో మాత్రం తెగిన పొడుగాటి స్పర్శకాలు (tentacles) మళ్ళీ పెరుగుతాయి. దీని వల్ల తేలుతున్నదేమిటంటే ప్రాణుల శరీరాల్లో సమయానికి తగిన పరిరక్షకచర్య తీసుకునే సంక్లిష్ట వ్యవస్థ ఉన్నప్పటికీ ఎల్లకాలం ఉండే యవ్వనానికీ, చావును తప్పించుకునేందుకూ ఏర్పాట్లు మాత్రం కనబడవు.
మనిషిలాగే జంతువులన్నీ ముసలివౌతాయి. కుక్కలూ, పిల్లుల సగటు ఆయుర్దాయం మనకన్నా తక్కువ. అలాగే ఏనుగు, తాబేలువంటివి మనకన్నా ఎక్కువ కాలం బతకవచ్చు. మరొక విశేషమేమంటే ముసలితనం అన్ని ప్రాణుల్లోనూ ఒకే వేగంతో ముంచుకురాదు. ముసలితనానికీ తినే తిండికీ కూడా సంబంధముంది. కొన్ని ప్రయోగాల్లో సగం పస్తులుంచిన ఎలుకలు ఎక్కువ కాలం బతికాయి. మొక్కల రెమ్మలు కత్తిరిస్తూ ఉంటే బాగా పెరుగుతాయని మనకు తెలుసు. మనుషుల్లో కూడా శరీరాన్ని వ్యాయామంద్వారానో, ఉపవాసాలద్వారానో "శ్రమ" పెట్టినప్పుడల్లా జీవితకాలం పొడిగించబడుతోందని రుజువయింది. అంటే దీనర్థం "సుఖజీవనం" సాగిస్తున్న శరీరం తప్పనిసరిగా ముసలితనం, చావు అనే ప్రకృతి నియమాలకు లొంగిపోతుందనా? ఆహారంలో "కేలరీలు" తగ్గించి, విటమిన్లూ, ఖనిజలవణాలూ ఎక్కువగా తిన్న జంతువులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతున్నాయి.
పరిణామవాదాన్నిబట్టి చూస్తే తిండికి లేమి కలిగిన ప్రతికూల పరిస్థితిలో జాతి అంతరించిపోకుండా ఉండేందుకు ప్రాణుల శరీరాలు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మన శరీరాల్లో దాదాపు అన్ని అంశాలనూ శాసించేవి జన్యువులే (జీన్స్‌). మన ఆరోగ్యాన్నీ, ఆయుర్దాయాన్నీ శాసించేవి మన శరీర కణాల్లో అతిసూక్ష్మ స్థాయిలో జరిగే మార్పులేనని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి వేదాంతులైనా తమకు రోగం వచ్చినప్పుడు నిర్లిప్తంగా ఉండలేరు. సమస్యలను అర్థం చేసుకున్న శాస్త్రవిజ్ఞానం ద్వారా తగిన చికిత్సను పొందగలిగితే వారు మరికొన్నాళ్ళు బతికి, తమ వేదాంతాన్ని మరింత వల్లె వేయగలుగుతారు! రోగచికిత్స కూడా లాభాలు గడించే వ్యాపారంగా మారుతోందనేది నిజమైనా శాస్త్ర పరిశోధనలవల్ల ప్రజలకు కొంతయినా మేలు జరుగుతోందనడంలో మాత్రం సందేహం లేదు.


ఎందుకొస్తుంది?






ముసలితనమూ, చావూ అసలు ఎందుకు వస్తాయి? ప్రారబ్ధం, పూర్వజన్మఫలం మొదలైన చాదస్తాలను పక్కనపెడితే ప్రకృతిలో ఇటువంటిది ఎందుకు జరుగుతుందో ఆలోచించవచ్చు. దీన్ని గురించిన వైజ్ఞానిక ప్రతిపాదనలు కొన్ని ఉన్నాయి. వీటిలో ఒకటి తరతరానికీ సంతతిలోని జన్యువుల్లో యాదృచ్ఛికంగా కలిగే మార్పులకు సంబంధించినది. ఇటువంటి మ్యుటేషన్ల వల్ల కొత్త తరం ప్రాణుల్లో కొన్ని కొత్త లక్షణాలతో పుట్టవచ్చు. అయితే వీటిలో బతికేవి పరిసరాల్లో భౌతికంగానూ, భౌగోళికంగానూ అప్పుడప్పుడూ కలిగే మార్పులకు అనుగుణంగా ఉన్న ప్రాణులే. కొన్ని శరీరలక్షణాలు కలిగిన ప్రాణి మరీ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైతే చచ్చిపోతుంది. దానికి పుట్టిన సంతానంలో ఏ ఒక్కదానికైనా అటువంటి పరిస్థితులకు తట్టుకోగలిగిన శారీరక లక్షణాలు ఉన్నట్టయితే కనీసం అదైనా బతుకుతుంది.
ఈ లెక్కన ముసలితనం అనేది ప్రాణి శరీరానికి పటుత్వం తప్పి, అంత్యదశకు చేరబోయే ముందు దశ. మనుషుల విషయంలో పెరిగే వయస్సును గురించిన అనేక భావావేశాలూ, ఉద్వేగాలూ కలగడం మామూలే కాని తక్కిన ప్రాణుల విషయంలో అటువంటి 'భేషజా'లేవీ కనబడవు. అందుచేత ఈ వ్యాసానికి సంబంధించినంతవరకూ అలాంటి భావనలనూ, అనుభూతులనూ గురించిన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టాలి.
ప్రాణుల్లోని మూల జీవపదార్థం డీఎన్‌ఏ. ఇక్కడ ముఖ్యవిషయం ఏమిటంటే ప్రాణి బతికున్నన్నాళ్ళూ జీవకణాలలో ఉండే డీఎన్‌ఏ తన మనుగడను కొనసాగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. సంతానోత్పత్తి జరిగినప్పుడల్లా అది కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రకృతికి సంబంధించినంత వరకూ ఆ పదార్థం తల్లీ పిల్లల్లో దేని శరీరంలో ఉన్నా ఫరవాలేదు. పైగా ఒక ప్రాణి శరీరం యాంత్రికంగా కొన్ని సంవత్సరాలకు మించి "నడవదు". దాన్ని రిపేరు చేసుకుంటూ, ఎల్లకాలం నడపడంకన్నా దాని స్థానంలో అదే జన్యుపదార్థం కలిగిన మరొక ప్రాణిని పెంచి పెద్దచెయ్యడం ప్రకృతికి తక్కువ "ఖర్చు"తో కూడిన వ్యవహారం. ఇందులో ప్రత్యక్షంగా సృష్టికర్త ఎవడూ లేకపోయినా డార్విన్‌ చెప్పిన జీవపరిణామం "గుడ్డి"గా ఇదే మార్గాన్ని అనుసరిస్తుంది. ఏ "ఉద్దేశమూ" లేకుండా జీవపరిణామం వీలున్నంత సులువుగా ముందుకు సాగాలంటే ప్రాణులు కొంతకాలానికి చచ్చిపోవడమూ, వాటి స్థానంలో వాటి జన్యులక్షణాలను కొనసాగించగలిగిన కొత్తవి పుట్టుకురావడమే "తేలిక". దీన్నర్థం చేసుకుంటే ప్రకృతిలో ముసలితనమూ, చావూ ఎందుకు ఉన్నాయో తెలుస్తుంది. నాశనం కాకుండా ఎల్లకాలమూ నిలిచేది ఆత్మకాదు; మన డీఎన్‌ఏ. చావును ప్రకృతి 'ఎంపిక' చేసిందంటే అందుకు ముఖ్యమైన కారణం సంతానోత్పత్తిలో జన్యువైవిధ్యం సాధ్యమవుతుందనే. ఏ ప్రాణి ఐనా తన శరీరలక్షణాలను ప్రతికూల వాతావరణానికి తగినట్టుగా మార్చుకోలేదు గనక అటువంటి మార్పు దాని సంతానంలో తప్ప జరగడానికి లేదు. జీవపరిణామపు పోటీలో విజయం సాధించాలంటే 'పాత' జీవాలు చావడం, కొద్దిపాటి మార్పులతో కొత్త ప్రాణులు పుడుతూ ఉండడం తప్ప గత్యంతరం లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా కాకపోయినా 'అంతిమవిజయం' పొందిన ఏర్పాటు కనక చావు అనేది డీఎన్ఏ వైవిధ్యానికీ, అది రకరకాల పరిస్థితుల్లో కొనసాగడానికీ దోహదపడింది. ఏ తరానికాతరం చచ్చిపోయి, కొత్త తరాలు పుట్టుకురావడమే ప్రాణుల 'సహజ' లక్షణంగా మిగిలిందనుకోవాలి.
మన వయస్సు పెరుగుతున్నకొద్దీ మతిమరుపూ, ఆలోచనావేగం మందగించడం వగైరాలు మొదలౌతాయి. వీటిలో కొన్నిటికి కారణం థైరాయిడ్‌ లోపాలూ, కుటుంబసభ్యుల మరణం, నిద్రలేమి, అంటువ్యాధులూ, ఇతర మందుల దుష్ప్రభావాలూ మొదలైనవి ఏవైనా కావచ్చు. ఇవికాక శరీరంలోని ఇమ్యూన్‌ వ్యవస్థ వంటివి సరిగ్గా పనిచెయ్యకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యాధులు కలిగించే క్రిములనుంచి కాపాడగలిగిన ఇమ్యూన్‌ వ్యవస్థ వయస్సుతో బలహీనపడినప్పుడు అది శరీరంలో విడుదల చేసే ఏంటీబాడీలకు "తమ" పదార్థానికీ, బైటినుంచి ప్రవేశించిన "శత్రు" పదార్థాలకూ తేడాలు గుర్తించడం కష్టమౌతుంది. మామూలుగా వచ్చే రోగాలూ, ఒత్తిడులూ, పరిసరాల్లో కలిగే మార్పులూ ఇలా మొత్తంమీద అనేకరకాల కారణాలు ముసలితనానికి దారితీస్తాయి. ఇవేకాక యాదృచ్ఛికంగా జన్యువుల్లో కలిగే వినాశం చిన్న చిన్న తప్పులుగా మొదలై కొంతకాలానికి శరీరాన్ని పెద్దగా ప్రభావితం చేసే స్థితికి చేరుకుంటుంది.
ఈ రోజుల్లో మనిషి సగటు ఆయుర్దాయం పెరిగిపోతోంది. దేవతల్లాగా ఎల్లకాలం యవ్వనులుగా బతకలేకపోయినా బతికిన్నన్నాళ్ళూ ఆరోగ్యంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ముసలితనం మనని ఎలా శిథిలం చేస్తుందో తెలుసుకుంటే ఆరోగ్యానికి కీలకం తెలుసుకోవచ్చు. చాలామందికి ముసలితనంలో సమస్య శారీరక పటుత్వం తగ్గి, రోగాలూ రొష్టుల పాలవడమే కాదు. మెదడుకు సంబంధించిన రుగ్మతలుకూడా కొన్ని కలగవచ్చు. వీటిలో ముఖ్యమైనవి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోవడం, నరాల డీజెనరేటివ్‌ హీనసత్వ లక్షణాలవల్ల సంక్రమించే అల్జ్‌హైమర్స్‌ వ్యాధి, ప్రేరక నాడీకణాల మోటర్‌ న్యూరాన్‌ జబ్బులు, పార్కిన్సన్‌ వ్యాధి వగైరాలు. వయసు పైబడినప్పటికీ పూటగడవడానికో, ఇతర కారణాలవల్లనో వీరిలో కొందరైనా తమకూ సమాజానికీ పనికొచ్చే కొన్ని వృత్తులనూ, పనులనూ కొనసాగించక తప్పదు. అలాంటప్పుడు వీరిలో అనివార్యంగా కలిగే రుగ్మతలూ, అవసరమయే ప్రత్యేక సౌకర్యాలూ సమాజంపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి? వణుకుతున్న అవయవాలతో, మందగిస్తున్న చూపుతో ఎంతమంది అప్లికేషన్లో, మరో దరఖాస్తో చదివి, నింపి, చేత పట్టుకుని క్యూలలో నిలబడాలి? వీరిని సమాజం ఎంతవరకూ భరించి, ఆదరించి, పోషించగలుగుతుంది? వయసుమళ్ళినవారికి ఆశ్రమాలూ, ఇతర సదుపాయాలూ ఏర్పాటు చేసి నిర్వహించడం ఇప్పటికే ఒక పెద్ద పరిశ్రమగా రూపొందుతోంది. వీరి హక్కులనూ, అధికారాలనూ పరిరక్షించి, న్యాయ, సామాజికపరంగా కాపాడటానికి ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి, ఏర్పడుతున్నాయి. కృషి చేస్తున్నాయి. వీటిని గురించి ప్రతివారూ పట్టించుకోక తప్పదు. ఎందుకంటే నేటి యువతీ యువకులే రేపటి వృద్ధులు!

ముసలితనం



గౌతమ బుద్ధుడుగా పేరుపొందని పిన్నవయసులో సిద్ధార్థుడు మొదటిసారిగా రోగగ్రస్తులనూ, ముసలివారినీ, శవాన్నీ చూసి చలించిపోయాడని అంటారు. ప్రతి ప్రాణికీ తప్పనిసరిగా వచ్చే ముసలితనం ఎవరికీ నచ్చని ఒక సహజ పరిణామం. చివరి ఘట్టమైన మృత్యువుకు మునుపటి దశ కాబట్టి అదంటే మనకు కాస్త భయం కూడా. మనకు పూర్తిగా అర్థం కానటువంటి తక్కిన విషయాలలాగే ముసలితనం అనేది కూడా ఎన్నో అపోహలకు గురి అవుతూ ఉంటుంది. దీన్ని గురించిన ఆధునిక పరిశోధనలు ఎటువంటివో తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
మనం మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని రెండు రకాలుగా అర్థంచేసుకోవచ్చు. మొదటిది హేతువాద, భౌతికవాద పద్ధతి. రెండో పద్ధతిలో వేదాంత ధోరణీ, ఆధ్యాత్మిక వైఖరీ, మిథ్యావాదమూ మొదలైనవి ఎన్నయినా కలిసిపోయి ఉంటాయి. ఇక ఆ అయోమయంలో కళ్ళకు కనిపించే చరాచర ప్రపంచం గురించి ఎలాగయినా ఊహించుకోవచ్చు. ఈ ఊహలు నేలవిడిచిన సాములాగా ఉండకుండా, మనకు తెలిసినంతవరకూ ప్రకృతిని విజ్ఞానపరంగా అర్థం చేసుకోగలిగితే మనం కాస్త ప్రగతిని సాధించినట్టే. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా మానవసమాజం సాధించిన ప్రగతి ముఖ్యంగా విజ్ఞాన సముపార్జన మీద ఆధారపడినదే. ఈ అవగాహనలో ముసలితనాన్ని గురించిన భావనలు కూడా ఒక భాగమే.
మనుషులకి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం తమ ఉనికి. వీలున్నన్నాళ్ళు మంచి ఆరోగ్యంతో బతకడమే మనకు ప్రధానమైన విషయం. అందుకనే ఈనాటికీ ఎవరినైనా కలుసుకోగానే మొదట అప్రయత్నంగా "బాగున్నారా?" అని ఆడుగుతాం. కాని ఆరోగ్యాన్ని ఎంతగా కాపాడుకున్నా ముసలితనం మాత్రం రాకమానదు. ప్రకృతిలోని ప్రాణులన్నిటికీ వర్తించే ముసలితనం, చావు వగైరాల గురించి మనిషికి అనాదిగా తెలుసు. ఈ పరిణామదశలను అర్థం చేసుకోవడం మనిషికి సమాజ జీవితంలో సాధ్యమైంది. 50 వేల ఏళ్ళ క్రితమే నియాండర్తాల్ జాతి మానవులు శవాలను ఖననం చెయ్యడం మొదలుపెట్టారు. పుట్టుకనుంచి గిట్టేదాకా ఏమవుతుందో ఆదిమానవులు అనుభవం ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.


ఫ్రాన్స్ లోని 50 వేల ఏళ్ళనాటి నియాండర్తాల్ సమాధి
పుట్టినప్పుడు నిస్సహాయంగా ఉన్నప్పటికీ పసిపిల్లలు పెద్దయాక యుక్తవయస్సుకు చేరుకుంటారు. యవ్వనంలో శక్తినీ, బలాన్నీ, సంతానోత్పత్తికి సామర్య్థాన్నీ పొందుతారు. ఆ తరవాత అనుభవం, తెలివితేటలూ పెరుగుతాయి కాని శరీరం సడలిపోతుంది. నాగరికత మొదలైనప్పటినుంచీ మనవాళ్ళు నిత్యయవ్వనులుగా ఉంటే బాగుండునని కలలు కంటూనే ఉన్నారు. మన పురాణాల్లోని దేవతలు అమరులే కాదు. వారికి ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళే! ముసలితనంతో అమరులైతే మాత్రం లాభమేముంది? అందుకే మన దీవెనల్లో కూడా ఆయురారోగ్యాలు కలిసే ఉంటాయి.
శరీరంలో కలిగే రోగాలనూ, రొష్టులనూ పరిశీలించి తగిన చికిత్స చెయ్యడం ఏనాడో మొదలయింది. వీటిలో కొన్నయినా వార్థక్యాన్ని వాయిదా వేసే ప్రయత్నాల వంటివి. చరకుడూ, శుశ్రుతుడూ, బుద్ధుడి కాలంనాటి జీవకుడూ పేరుపొందారు. వీరంతా తమ కాలానికి సంబంధించినంత వరకూ "ఆధునిక" విజ్ఞానం సాధించినవారే. అందువల్ల మన దేశంలో మొదటినుంచీ వేదాంత ధోరణి మాత్రమే ఉండేదని వాదించేవారికి ఏమీ తెలియదనుకోవాలి. ఎందుకంటే భౌతికవాద, హేతువాద దృష్టి లేకుండా ఇటువంటి పరిశోధనలు చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. తరవాతి కాలంలో సూక్ష్మస్థాయిలో బాక్టీరియావంటి వాటివల్ల కలిగే పరిణామాలను అర్థం చేసుకోవడంలో వైద్య, శరీరశాస్త్రాలు ముఖ్యంగా పశ్చిమదేశాల్లో చాలా ప్రగతిని సాధించాయి.
మనిషి సగటు ఆయుష్షు కాలంతో బాటుగా పెరుగుతోంది. నియాండర్తాల్ దశలో 20 ఏళ్ళు బతికిన మానవులు ప్రాచీన గ్రీస్ నాగరికత నాటికి 28 ఏళ్ళూ, మధ్యయుగపు యూరప్ లో 33 ఏళ్ళూ బతికారు. 19వ శతాబ్దం అంతానికి 37కు మించని సగటు వయసు చికిత్సా పద్ధతుల్లోని అభివృద్ధి కారణంగా ఈ రోజుల్లో దాదాపుగా 70కి పెరిగింది. దీనివల్ల సమాజంలోనూ, జీవితం పట్ల మనుషుల దృక్పథంలోనూ కూడా ఎన్నో మార్పులు కలిగాయి. సగటు వయసునూ, జీవన ప్రమాణాలనూ కూడా మెరుగుపరిచే ప్రయత్నాలు మొదలయాయి. మరొకవంక ముసలితనానికి శాస్త్రీయ కారణా లెటువంటివో కూడా అవగాహనకు వస్తున్నాయి. తరవాతి వ్యాసంలో ఆ వివరాలు తెలుసుకుందాం.






మనిషి
సగటు ఆయుష్షులో పెరుగుదల



Saturday, January 17, 2009

హాస్యం

1 :
రాంబాబు కు ఏదో తెలియని మాయదారి రోగం పట్టుకుంది . తన వూళ్ళో ఉన్న అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రి గోవింద నారాయణ హాస్పటల్స్ లో చేరాడు .అన్ని పరీక్షలు చేసారు .పెద్ద డాక్టర్ గారు రిపోర్టులు అన్నీ పరిశీలించి "రాంబాబు ! రిపోర్టులు అన్నీ చూసాను .అయినా నీ అనారోగ్యానికి కారణం నాకు అంతుబట్టలేదు.బహుశా తాగుడు కారణమై ఉండవచ్చు" డాక్టర్ వంక పరిశీలనగా చూస్తూ ,"డాక్టర్ గారు ! మాయదారి రోగం తో బాధపడలేకుండా ఉన్నానండి. మీరు మాములుగా తాగకుండా ఉన్నపుడు చూసి చెప్పండి " అన్నాడు రాంబాబు .

2.కిరణ్:
కిరణ్ ,కల్పనలకు కొత్తగా పెళ్లైయింది. కల్పనకు కళలన్నా,
కళా ఖండాలన్నా చాలా ఇష్టం .ఓ సాయంత్రం షికారుకు ,సరదాగా రోడ్డున
పడ్డారు . ఐదునిమిషాల తరువాత కల్పన అడిగింది కిరణ్ ను గోముగా

"కిరణ్ !నువ్వు డిసైడ్ చెయ్యి .మనం " మనువాడని మొగుడు " సినిమాకు
వెళదామా ? ,మోడరన్ ఆర్ట్ ఎక్సిబిషన్ కు వెళదామా ? "

ఆమె కు ఇష్టమైన సినిమా ల సంగతి తెలిసిన వాడై , ఈ సారి
ఆర్ట్ ఎక్సిబిషన్ లోకి అడుగు వేసాడు కిరణ్ .

కల్పన గుమ్మం లోకి అడుగు పెడుతూనే ప్రశ్నించింది ,

"ఈ పెయింటింగ్ను ఇలా గుమ్మం పైన వెళ్ళాడ వేసారేమిటి కిరణ్ ,విచిత్రంగా? "

" బహుశా దాన్ని వేసిన వాడు దొరికుండడు " గొణిగాడు కిరణ్ .

లోపల పేయింటింగ్ లు తన్మయంగా చూస్తూ కల్పన , ఆమె వెనుక
ఆమెను , పెయింటింగ్ ను మార్చి మార్చి చూస్తూ కిరణ్ .

అలా ఓ గంట గడిచింది .

కల్పనకు ఓ పెయింటింగ్ విపరీతంగా నచ్చి కొనేసింది . ఆ ఆర్ట్ ను వేసిన
కుంచె సుందరరావు ఆమె తో చెప్పాడు ఆనందంగా

"మీరు మంచి చిత్రం ఎన్ను"కొన్నారు " .దీనికోసం నేను 10 ఏళ్ళు
కష్ట పడ్డాను "

"మీకు ఈ చిత్రం గీయటానికి పది సంవత్సరాలు పట్టిందా ? " అడిగింది
కల్పన .

" లేదు , ఒక్క రోజులోనే గీసాను .అమ్మటానికే పది సంవత్సరాలు పట్టింది "
అన్నాడు కుం.సుం.

కిరణ్ పై దయ కలిగి చూడటం ముగించి బయలుదేరింది .గుమ్మం ముందర
విజిటర్స్ బుక్ లో తమ అభిప్రాయాలు రాయవలసింది గా కోరాడు గార్డ్ .

కిరణ్ ఇలా రాసాడు :

పేరు : కిరణ్

పెయింటింగ్ లపై మీ అభిప్రాయం : అయోమయం

మీ రాకకు కారణం :
బయట భోరున వర్షం

మతిమరుపు రోగం

*
రాము,సోము తమ వీధిలో ఓ పెద్దాయన చనిపోతే పలకరించటానికి వెళ్ళారు .

రాము :90 ఏళ్ల తాతారావు గారు గుండ్రాయిలా ఉండేవారు.ఆ వయసులో
షేర్ వ్యాపారం చేసేవారు .సందు చివరి మిర్చి బండి దగ్గర బజ్జీలు రోజూ
తినే వారు .పేకాట ఆడేవారు .హటాత్తుగా ఎలా పోయారు ?

సోము : పెద్దాయనకు 2 నెలల క్రితం వరకు అంతా బానే ఉంది .ఉన్నట్టుండి

మతిమరుపు రోగం పట్టుకుంది . నిన్న రాత్రి కూడా చాలా సేపు మూడో పెట్టె
సిజర్స్ సిగరెట్లు తాగుతూ పేకాట ఆడాడు .నిద్రలో గాలి పీల్చటం మరచి
"పోయాడు ".
చిరుత:
ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత - బాలకృష్ణ తనయ

ఉడత - వెంకటేష్ తనయ

మిడత - మోహన్ బాబు తనయ

పిచుక - పవన్ కళ్యాణ్ తనయ





ఈ బుజ్జి బుజ్జి పంది పిల్లలు ఏంటనుకున్నారు..? నోరూరించే చాక్లెట్స్.. పైగా అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయని జర్మనీ దేశస్థుల నమ్మకం..!! అది సూచిస్తూ వాటి నోట్లో ఉన్నది జర్మన్ సెంట్స్ (పైసలు) కాయిన్ అన్నమాట.
చూడడానికి మాత్రం ఎంత ముద్దొస్తున్నాయో కదా.. వాటి కాళ్ళుగా, చెవులుగా ఉపయోగించింది ఏంటో తెలుసా.. బాదం పప్పు చెక్కలు..!
ఎంత చక్కటి పనితనమో కదా.. అభినందించి తీరాల్సిందే మరి :)








ఆరుద్ర

ఎంతని చెప్పను

చెమరిన కన్నుల చిత్తడినార్పగ
చెదిరిన గుండెల ఆర్తిని తీర్చగ
వేచిన మనసుకు విడుదల నేర్పగ
కరిగిన యెడదకు కఠినత చేర్చగ
విరిగిన తలపుల పొందిక కూర్చగ
ఆర్తిగ అరిచిన గొంతును తడపగ

కర్తను నెనై చెసిన తప్పుకు
క్రుంగిన మనిషిగ చెతులు చాపగ

తపనను తీర్చగ కవితలు రెపి
కరుణను చూపే కన్నుల చూసిన
నెచ్చెలి విలువను,

ఎంతని చెప్పను నేస్తం !?

తెలుగు కందం ఆంగ్లానికద్దితే ?

తెలుగు కందం ఆంగ్లానికద్దితే
అంతే అందం అబ్బుతుందోచ్‌ !!!

మాన్యులు తప్పులుంటే మన్నించగలరు,

కం:
ఫర్‌ సింపుల్‌ హాపీనెస్‌
బి ఇట్‌ యువర్స్‌ ఆర్‌ అథర్స్‌ డుగుడ్‌ ఓన్లీ
థిస్‌ సింపుల్‌ ఏక్ట్‌ విల్‌
డెఫినెట్‌లీ చేంజి వరల్డ్‌ ఫర్‌ గుడ్‌ స్లోలీ !!

for simple happyness
be it yours or others do good only
this simple act will
definitely change world for good slowly


ఇది ఏ పద్యమో తెలీదు కానీ
ఫ్లోలో వస్తే రాసి సద్దుకుపోయా

కందంబబ్బెను నాకని
అందంగా మాట చెప్ప ఆంగ్లము నైనన్‌
పొందిగ్గా రాయగల్గితి

వింటర్ బ్లూస్ ...

ఎండు చెట్టు కొమ్మ లన్ని
వెండి పూత పూసు కుంటె
గువ్వ పిట్ట గూడు లోన
గోల చేసి వూరు కుంది

నేల తల్లి ఒంటి మీద
ముగ్గు బుట్ట లెన్నో పెట్టి
ఒక్క తన్ను తన్ని నట్టు
తెల్ల బోయి మిన్న కుంది

చెట్టు లన్ని రంగు లద్ది
బోరు కొట్టి నట్టు వుంది
ఊరు అంత వెల్ల గొట్టి
దేవు డూదె చల్ల గాలి

గడ్డి పూస లేని చేలు
ఒట్టి పోయి నట్టు ఉంటె
లేడి కూన ఆడ చేరి
తిండి లేక బోరు మంది

ఏటి లోన నీరు కూడ
గడ్డ గట్టి నిండు కుంది
తాగ చుక్క నీరు లేక
నేల నోరు ఏండు కుంది

మంచు రాలి ఆగి నాక
కప్పు వెంట కారి కారి
సూది లాగ రూపు కట్టి
తెల్ల పళ్ళు చూపె చూరు

రోడ్డు పక్క కుప్ప జేరి
గడ్డి వాము అంత కూడి
కాళ్ళు కింద పెట్ట జారి
కుంటు వారి తీరు చూడు

బండి ఎక్కి పారి పోవ
తాను మంచు కుప్ప దూరి
పైకి నన్ను లాగ మంటు
దీన గాధ చెప్ప సాగె

ఎందు కీడ కొచ్చి నాను
మంచు తోడ చావ గోరి
ఇండి యాలో ఉండి పోతె
వెచ్చ గానె ఉండి పోదు

తిన్న తిండి లోన చేరి
చల్ల గుండి ఆక లైదు
వేడి నీరు తాగి నాకు
దాహ మింక తీర రాదు

మాయ దారి పచ్చ నోటు
తస్స దీని దుంప కొయ్య
చిక్కు లెన్ని తెచ్చి పెట్టి
మంచు వెల్ల నాకు కొట్టె

తట్ట బుట్ట సద్ది ఇంక
ఇంటి దారి పట్ట బోతె
ఫ్లైటు రేటు పైకి పోయి
చుక్క లెంట చేరె నేడు

ఎర్ర బస్సు ఈడ రాదు
ఊరు మాది దాపు లేదు
ఎండ రోజు లొచ్చు దాక
వేచి ఉండ వచ్చె నాకు

తప్పు లుంటె దిద్ది పెట్టి
ఒప్పు కుంటె భేషు కొట్టి
తప్ప కుండ నాకు జాబు
పెట్ట కుండ పోరు మీరు


ఎంటి silentగా ఉన్నావు ?

ఎంటొ అంత silentగా కూర్చున్నావు
something ఏమన్నా చెప్పొచ్చుగా ?
after a long time కల్శామా ?
కనీసం shake hand ఐనా ఇవ్వొచ్చుగా?

కళ్ళు దించుకుని కామోషై పోయావు
atleast కన్నెత్తైనా చూడొచ్చుగా ?
నాకేంటొ ఇది strangeగా అనిపిస్తుంది
కనీసం ఒక joke ఐనా వెయ్యొచ్చుగా ?

ఆరాటంగా ఆశగా ఆబగా ఆతృతగా
you know, పరుగెట్టుకొచ్చా
నీతో చాలా చెప్పాలని అడగాలని
now see ఏమయ్యిందో
ఇద్దరు ఒంటరులం జంటగా కూర్చున్నాం
దీనికి ఇక్కడిదాక why to come?

smile ఐనా ఇవ్వొచ్చు
మరి కాస్త closeగా జరగొచ్చు

ఎంటొ అంత silentగా కూర్చున్నావు
something ఏమన్నా చెప్పొచ్చుగా ?

నీతో ఎప్పుడూ ఇంతే
నా చావుకొచ్చింది
సరే ఐతే leave it !!
నేనే ఏదో ఒకటి చేస్తా
ఏంటి అనా ఆ look ?
రేపటి కోసం waitinగమ్మా
ఇంకేంచేస్తాం

నిను చూడగానే...
అప్పటిదాక లేని ప్రాణం లేచి పరుగెట్టి వచ్చింది
ఈడ్చినా రాని కాళ్ళు నింగిలోకెగిరేసి నీకాడ నిలిచాయి
సగం చచ్చిన కళ్ళు ప్రాణాలు పూశాయి
ఆలింగనాలకై ఒళ్ళు పరవళ్ళు తొక్కింది

నిను చేరగానే...
ఒక పాలు చలి నేడు ఎక్కువయ్యిందేమో
అటుచూడు నీ నోరు పొగలు గక్కేస్తోంది
నిషాల్ని నింపేటి నీ ఒంటి ఆ తావి
కైపుల్ని రేపుతూ గుండెల్లో గిలిపెట్టె

ఈరోజు నీ మధువు నేగ్రోలనున్నాను
ఈనాడు నాగెలుపు తధ్యమే చిన్నారి
పొంగుల్ని తగ్గించి నా మాట మన్నించి
వలువల్ని విడిచేసి గుండెల్లో మఠమేసి


రసాస్వాదనాలింగనాల్లోన నేడు
ముంచవా
.
.
.
.
.
.
కాఫీ !!

వ్యంగ్య చిత్రాలు





అన్నపూర్ణ ఆంధ్ర ప్రేదేశ్ గురించి డాకుమెంటరీ

డౌన్లోడ్ చేయండి :

కామెడీ రారాజు భ్రమంనందం సన్మానం

డౌన్లోడ్ చేయండి:

షిరిడి సాయి నిజమఏన ఫోట్స్

డౌన్లోడ్ చేయండి:

పాత తిరుపతి ఎలావుంటుందో చుడలేంటే ...

డౌన్లోడ్ చేయండి: