Thursday, February 19, 2009

రామాయణం నిజంగా జరిగిందా?

సీతమ్మ ను రావనసుడు దచిపెటిన అశోక వనం:
హనుమాన్ తోకతో తగులబెట్టిన ప్రాంతం:
రామ్ సేతు నిర్మాణంలో ఉపయోగించిన రాయీ:

రామ సేతు నిజంగా ఉంది అని గూగుల్ వారి ఫోటో:
మరి కొన్ని అపుర్వు ప్రాంతాలు:

Tuesday, February 10, 2009

comedy cine bits

మా చెల్లి కి మల్లి మల్లి పెళ్లి -తనికిల్ల భరణి :

డౌన్లోడ్ చేయండి:

బ్రహ్మానందం రోడ్ రోలరు ఓనరు:డౌన్లోడ్ చేయండి:

కామెడీ రాజు సునీల్

సునీల్ రన్ మూవీ :
డౌన్లోడ్ చేయండి:
సునీల్ పంచ్ ధర్మ వారపు :

డౌన్లోడ్ చేయండి:

మైఖేల్ జాక్సన్ తెలుగు కామెడీ సాంగ్స్

తెలుగు తమ్ముడు సినిమాలో మైఖేల్:
డౌన్లోడ్ చేయండి:

మైఖేల్ యంకమ పాట వీన లంటే :

డౌన్లోడ్ చేయండి:

మైఖేల్ విషాద గానం:డౌన్లోడ్ చేయండి:

Tuesday, February 3, 2009

ఈనాటి వార్తలు

వై. యస్. ప్రభుత్వపు మొదటి ప్రోజక్టు రడీ!!!

ఏమిటీ పోలవరమా? పులిచింతలా? అప్పుడే ఎలా రడీ అయ్యింది? అని బోల్డంత హాచ్చెర్య పడి పోతున్నారా?
ఆ ప్రోజక్టుల సంగతి కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే, ఆ ప్రోజక్టులకు టెండర్లు పంచుకునే, సారీ, వేసుకునే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదుకదా! ఏదో పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చాక, ఇలాంటి ప్రజా 'షేవా' కార్యక్రమాలని చూసీ చూడ నట్లు వదిలేయాలి.

సరే ఇక పూర్తయిన ప్రోజక్టు అంటారా? అదేనండీ, మన ముఖ్య మంత్రి గారి ఇల్లు, మొత్తానికి రెడీ అయిపోవచ్చిందట. ఇప్పటి దాకా, ఇల్లులేని మన వై.యస్. గారు ఒక ఇంటి వారయిపోతారు. ఏదో కొన్ని వాస్తు దోషాలు,సరి చేస్తున్నారట అంతే,ఏముందండీ, మహా అయితే మరో కోటి ఖర్చు ఎక్కువ అవుతుంది, వాస్తు కోసం అంతే.

మా వాస్తు విద్వాంసుల అనాలిసిస్ ప్రకారం, ఒక సారి ముఖ్య మంత్రి గారు, ఆ ఇంట్లో ప్రవేశం చెయ్యగానే మన రాష్ట్రానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ బోనస్ తో సహా తీరిపోతాయట. మచ్చుకి కొన్ని...

* రైతుల తో పాటు, IT కంపెనీ లకు కూడ కరెంటు ఫ్రీ.
* తెలంగాణా తో పాటు, రాయలసీమ, కోనసీమ సమస్యలు కూడా పరిష్కారం.
* మంచి నీటికే కాదు, మద్యానికి కూడ కరువు ఉండదు.
* పోలవరం, పులిచింతల తో పాటు అన్నవరం,రెంటచింతల లో కూడా భారీ ప్రొజెక్టులు.
* నక్సలైట్లతో పాటు,పోలీసుల పైన కూడా నిషేధం.
* వై.యస్. గారి తోడల్లుడి పవర్ ప్రోజక్టు తో పాటు, చంద్రబాబు భార్య గారి డైరీ ప్రోజక్టు కూడ మూసివేత.

కనుక, ఆయనగారి ఇంటికీ, వాస్తు కీ అయిన ఖర్చు గురించి భాధ పడకండి. అంతా మన మంచికే.


క్రికెట్ ప్రేమికుల కోసం ఒక మంచి ప్రోడక్ట్ ...

హలో! మీరు క్రికెట్ ప్రేమికులా? ఐతే ఇది మీ కోసమే చదవండి.
ఈ మధ్యే జరిగిన ఇండియా పాకిస్తాను సిరీస్ కోసం Maggy Noodles వాళ్లు ఒక కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేసారు. "Maggy Easy Noodle for Cricket Lovers" అని పేరు పెట్టిన ఆ నూడిల్స్ విశేషం ఏమిటంటే, వినూత్నమైన మరియు అతి సులభమైన దాని తయారీ విధానమే అని అంటున్నారు, దాని తయారీదారులు.
మీ కోసం ఆ తయారీ విధానం అందిస్తున్నాం చూడండి.


*India Pakistaan మాచ్ ను మీ టీవి లో ట్యూన్ చెయ్యండి.
* ఇండియా బ్యాటింగ్ చేసే టప్పుడు ఒక ఓవర్ బ్రేక్ లో కిచెన్ లోకి వెళ్లండి.
* రెండు కప్పుల మంచి నీళ్లను గిన్నె లో మరిగించండి.
*నీళ్లు మరిగే లోగా మీరు మళ్లీ మ్యాచ్ చూడవచ్చు.
* గంగూలీ బ్యాటింగ్ కి రాగానే, నూడిల్స్ ని పాకెట్ లో నుంచి తీసి మరిగించిన నీళ్లలో వేయండి.
*టేస్ట్ మేకర్ ని కలపండి.
*అంతే, మీరు మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్లి పోవచ్చు.
*గంగూలీ ఔట్ అయ్యే వరకు, వెయిట్ చెయ్యండి.
*గంగూలీ ఔట్ అయ్యిన మరు క్షణం మీ నూడిల్స్ మీకోసం తయార్.



ఎంత మంచి నేరస్తులు ?

ఏమిటీ ఓ పక్క నేరస్తులు అంటూనే మళ్ళీ మంచి వాళ్ళు అంటున్నానని అనుకుంటున్నారా? కాకపోతే ఏమిటండీ, ఇలా నేరం చేసి, నేనె చేసాను నమ్మండీ అని పోలిసులను బ్రతిమాలుకుంటున్నారంటే వాళ్లు ఎంత మంచి వాళ్లు అయి ఉండాలీ?
అదే నండీ పరిటాల హంతకుల గురించే చెపుతుంట. ఒకాయనేమో, నెనే చంపాను బాబో నమ్మండి, అమ్మతోడు, అని మొత్తుకుంటున్నాడు. ఇంకో ఆయనేమో, నేనూ లొంగిపోతా, కాకపోతే చిన్నపని ఉంది, మరో ఇద్దరిని మాత్రం వేసేసి ఆ తర్వాత, తీరిగ్గా లొంగిపోతా అంటున్నాడు. ఎంత నిజాయితీ కనపడుతుందో చూసారా ఆయన మాటల్లో.
ఇంత మంచి రోజులు వస్తాయని ఎపుడైనా అనుకున్నామా చెప్పండి? ఇక పై ఎవరు ఎవరిని చంపారో అని, పోలీసుల కు టెన్షన్ ఉండదు, జనాలకు ఇంకెపుడు పట్టుకుంటారో అనే ఆత్రుత ఉండదు. అంతా మంచే, అందరూ మంచోళ్లే.