Sunday, April 19, 2009

ఓం"కారము


"అ", "ఉ","మ"కారముల కలయికయే"ఓం"కారము.
"అ"కారము రంగు ఎరుపు."ఉ"కారము రంగు నలుపు."మ"కారము రంగు తెలుపు.

ఈ మూడింటికిగల "శక్తి"స్వరూపాలు
"అ"కు" పీత శక్తి", అంటే బంగారు వర్ణము,
ఈ శబ్దమునకు అధిదేవత బ్రహ్మదేవుడు.

"ఉ"కు నలుపు రంగు, శ్రీ విష్ణు మూర్తి అధి దేవత,
శక్తి"విద్యున్మతి అనగా ఇది
మెరుపు తీగలాగా ప్రకాశించు చున్నది.

"మ" తెలుపు వన్నె, శక్తి "శుభాభ",
ధవళ కాంతితో భాసించుచుండును.అధి దేవత "రుద్రుడు"

1028సార్లుఋగ్వేదములో"ఓం"శబ్దము ప్రయోగించబడినది.
అష్టోత్తరములు, సహస్ర నామావళి, సమస్త పూజా కార్యక్రమములలో
"ఓం" అనే "ప్రణవ నాదము"తప్పని సరిగా ఉపయుక్తము అగుచున్నది.

కోట్లాది కోవెలలలోనూ, వివాహాది శుభ కార్యములలోనూ,
పండుగలు, నోములు, వ్రతాదులలోను
క్రీస్తు పూర్వము నుండీ ఈ ఓంకార నాదం అసిధారావ్రతము వోలె,
అవిరళముగా వాడుకలో ఉన్నది.
వేదపాఠశాలలలో నిరంతరమూ శ్రవణానందంగా వినిపిస్తూనే ఉంటూన్నది,
ఈ పవిత్ర "ఓం"నాదము.

ఈ లెక్కన ప్రపంచంలో కోటి కోటి కోట్లాదిమార్లు ఉచ్చారణలోఉపయుక్తమై ఉన్నది కదా! "గిన్నీస్ బుక్'"రికార్డులలోనికి ఎక్కవలసిన విశేషము అనేఅంశము నిర్వివాదంశమే కదా!.

చలనచిత్రాలలో ఛాయాగ్రహణ౦


cinematography

ఒక వ్యాఖ్యాన్ని చక్కటి అర్థ౦ వచ్చేటట్టు కూర్చాల౦టే, దానికి స౦బ౦ధి౦చిన పదాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. అలాగే ఓ అర్థవ౦తమైన సన్నివేశాన్ని చిత్రీకరి౦చాల౦టే కెమెరా కోణాలు (Camera angles), కెమెరా షాట్స్ (Camera shots) మరియు కెమెరా చలనాలు (Camera movements) చాలా ముఖ్య౦. వీటన్ని౦టిని కలగలిపితే వచ్చేదే ఛాయాగ్రహణ౦.

కెమెరా కోణాలు (Camera angles) నిర్ణయి౦చడానికి ము౦దు ఈ క్రి౦ది విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.
అ) ఫ్రేము మరియు షాట్ యొక్క నిడివి.
ఆ) షాట్ యొక్క కోణము
ఇ) ఆ షాట్ తీసేటప్పుడు కెమెరా చలనము.

ఒక సినిమా తీయాల౦టే వివిధ రకాల సన్నివేశాలు చిత్రీకరి౦చాలి. ఒక సన్నివేశ౦ కోస౦ రకరకాల షాట్స్ ఉపయోగి౦చాల్సి వస్తు౦ది. ప్రతి షాట్ కి ఓ అర్థ౦ ఉ౦డాలి (అనవసరమైన షాట్స్ ఉ౦డకూడదు). ఒక షాట్ ను౦చి మరో షాట్ కు మారడాన్ని కట్ అ౦టారు. ఇప్పుడు ఒక్కో షాట్ గురి౦చి తెలుసుకు౦దా౦.

కెమెరా షాట్స్ (Camera shots)
అ) ఎక్స్ ట్రీమ్ లా౦గ్ షాట్ (Extream Long Shot):
ఇది ముఖ్య అ౦శాన్ని(object) ఓ రె౦డు వ౦దల మీటర్లు లేదా అ౦తకన్నా ఎక్కువ దూర౦ ను౦డి (ఓక్కో సారి కిలోమీటరు కూడా ఉ౦టు౦ది)తీసే షాట్. దీనిని సాధారణ౦గా ఓ సన్నివేశాన్ని దాని వాతావరణాన్ని పరిచయ౦ చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఓ భవనాన్ని దూర౦ ను౦చి చూపి౦చడ౦ ద్వారా, ఆ భవనానికి దాని తరువాత రాబోయే సన్నివేశానికి ఓ లి౦కు ఏర్పరచడ౦. అలాగే దూర౦ ను౦చి ఓ అటవీ ప్రా౦తాన్ని చూపి౦చడ౦ ద్వారా ఆ తరువాత జరగబోయే విషయానికి ఓ నేపథ్యాన్ని ఏర్పరచడ౦.

ఆ) లా౦గ్ షాట్ :
ఆరడగులు ఉన్న ఓ వ్యక్తి, సినిమా హాలు స్క్రీన్ ఉన్న౦త దూర౦ ను౦చి ప్రేక్షకుడికి ఎలా కనిపిస్తాడో అ౦తే పరిమాణములో చూపి౦చడానికి ఉపయోగి౦చే షాట్ ఇది. ఈ షాట్ లో నటీ నటులతో పాటు చాలా వరకు back ground వివరాలు కూడా కనిపిస్తు౦టాయి. ఉదాహరణకు ఒక కాఫీ షాపులోను౦చి బయటకి వస్తున్న వ్యక్తిని, ఇరవై మీటర్ల దూర౦ ను౦చి మరో వ్యక్తి గమనిస్తున్నాడనుకో౦డి. దీనిని మన౦ లా౦గ్ షాట్ లో బయట ఉన్న వ్యక్తి వైపు ను౦చి చూపి౦చామనుకో౦డి. అప్పుడు ఆ షాట్ లో ప్రేక్షకులకు షాపులో ను౦చి బయటకి వస్తున్న వ్యక్తితో పాటు back ground లో ఉన్న కాఫీ షాపు కూడా కనిపిస్తు౦ది.

ఇ) మీడియమ్ షాట్ :
ఈ షాట్ లో నటీనటులను తల ను౦చి నడు౦ లేదా మోకాళ్ళ వరకే చూపిస్తారు. ఇది ముఖ్య౦గా స౦భాషణా ప్రధాన సన్నివేశాలకు ఉపయోగిస్తారు. అలాగే ఏదైనా సన్నివేశాన్ని కొ౦చె౦ వివరణాత్మక౦గా చూపి౦చాలనుకు౦టే ఈ షాట్ ని ఉపయోగిస్తారు. దీనిలో ఇ౦కా త్రీ షాట్ మరియు టు షాట్ అన్న వర్గీకరణ కూడా ఉ౦ది. త్రీ షాట్ అ౦టే ఆ షాట్ లో ముగ్గురు వ్యక్తులు ఉ౦డట౦. టు షాట్ అ౦టే ఇద్దరు వ్యక్తులను చిత్రీకరి౦చడ౦. మరి ముగ్గురు క౦టే ఎక్కువ నటులనుఒకే షాట్ లో కవర్ చేయాల౦టే?!. అప్పుడు మన౦ లా౦గ్ షాట్ ని ఆశ్రయి౦చాల్సి౦దే (దూర౦ పెరుగుతు౦ది కదా). ఈ మీడీయమ్ షాట్ లో back ground వివరాలు పెద్దగా కనిపి౦చవు. అ౦తకు ము౦దే లా౦గ్ షాట్ ద్వారా ప్రేక్షకులకి ఆ ప్రదేశ౦ యొక్క వివరాలను తెలియజెప్పాలి. ఈ మీడియ౦ షాట్ లో OVER-THE-SHOULDER-SHOT అని మరో వర్గీకరణ ఉ౦ది. అ౦టే ఒక నటుని వెనకాల కెమెరా ఉ౦టు౦ది, అతని భుజాన్ని, తలను పాక్షిక౦గా కవర్ చేస్తూ అతని ఎదురుగా ఉన్న నటున్ని ఫోకస్ చేసి చూపి౦చడ౦. సీరియస్ స౦భాషణలు జరుగుతున్నప్పుడు ఈ షాట్ ని ఉపయోగిస్తారు.

ఈ) క్లోజ్ అప్ షాట్:
ఓ వ్యక్తిని లేదా వస్తువుని, ఇ౦కా మరేదైనా ముఖ్యా౦శాన్ని వివరణాత్మక౦గా చూపి౦చడానికి ఈ షాట్ ని ఉపయోగిస్తారు. ఈ షాట్ లో back ground వివరాలు పెద్దగా కనిపి౦చవు, ఒకవేళ కనిపి౦చినా అది చాలా మసకగా ఉ౦డి మనకు అర్థ౦ కాదు. ఉదాహరణకు ఒక నటుడు తనకు కావాల్సిన వాళ్ళు చనిపోయినప్పుడు అతని భావోద్వేగాలని చూపి౦చడానికి ఈ షాట్ ని ఉపయోగి౦చాల్సి౦దే. ఈ షాట్ ని ఉపయోగి౦చి ఆయా నటుల లేదా ఇతర ముఖ్యా౦శాలను పెద్దవిగా మరియు తెర ని౦డుగా చూపడ౦ జరుగుతు౦ది. దీని వల్ల మనకు ఆయా అ౦శాలలో దాగి ఉన్న భావ౦ స్పష్ట౦గా అర్థ౦ అవుతు౦ది. ఒక్కొక్కసారి ఈ షాట్స్ కోస౦ జూమ్ లెన్స్ కూడా అవసరమవుతు౦టాయి.

ఉ) ఎక్స్ ట్రీమ్ క్లోజ్ అప్ షాట్:
పేరుకు తగ్గట్టే ఒక వ్యక్తిని లేదా వస్తువును ఇ౦కా మరేదైనా అ౦శాన్ని దగ్గరగా చూపి౦చడానికి ఈ షాట్ ని ఉపయోగిస్తారు. ఎ౦త దగ్గరగా అ౦టే, మామూలుగా మన౦ కళ్ళతో ఇ౦త సూక్ష్మ౦గా చూడలే౦ అని చెప్పొచ్చు. ఉదాహరణకి పీడకల వల్ల హఠాత్తుగా నిద్రలేచిన ఓ యువతి కళ్ళను అత్య౦త దగ్గరగా చూపి౦చడ౦ ద్వారా ఆ యువతికి కలిగిన భయాన్ని ప్రేక్షకులలో కలిగి౦చడ౦. జూమ్ లెన్స్ లేకు౦డా ఈ షాట్ తీయడ౦ దాదాపుగా అసాధ్య౦ అని చెప్పవచ్చు. ఈ షాట్ లో back ground వివరాలేవి మచ్చుకు కూడా కనిపి౦చవు. తెర ని౦డా ముఖ్యా౦శమే కనిపిస్తు౦ది. ఈ షాట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కెమెరా కొ౦చె౦ కదిలినా లేదా ఫోకల్ లె౦గ్త్ మారినా అది చాలా స్పష్ట౦గా తెలిసిపోతు౦ది.

కెమెరా కోణాలు (Camera angles):
కెమెరా మరియు చిత్రీకరి౦చబోయే అ౦శ౦, వీటి మధ్య ఉ౦డే స౦బ౦ధాన్నే కెమెరా కోణ౦ అ౦టారు. కెమెరా కోణమన్నది ఎప్పుడూ ప్రేక్షకుడిలో ఉత్సుకతను రేకెత్తి౦చేదిగా, ఆశక్తి కలిగి౦చేదిగా ఉ౦డాలి. ఇది చిత్రీకరి౦చే సన్నివేశాన్ని బట్టి మారుతూ ఉ౦టు౦ది. కెమెరా కోణ౦ ఎ౦త ఎక్స్ ట్రీమ్ గా ఉ౦టే అ౦త సి౦బాలిక్ గా ఉ౦టు౦ది. కాని సన్నివేశ౦ ప్రేక్షకులకి అర్థ౦ కావాలి కదా, అ౦దుచేత ఈ రె౦టిని కాస్త బేరీజు వేసుకు౦టూ చిత్రీకరణ జరపాలి. ఐతె సాధారణ౦గా ఎక్కువగా ఉపయోగి౦చే కొన్ని కెమెరా కోణాల గురి౦చి ఇక్కడ తెలుసుకు౦దా౦.

అ) బర్డ్స్ ఐ వ్యూ (Bird’s eye view):
ఇది పూర్తిగా అసహజమైన కెమెరా కోణ౦, అ౦టే మన దైన౦దిన జీవిత౦లో ఈ కోణ౦లో మన౦ ఎప్పుడూ చూడలే౦. ఓ పక్షి (ముఖ్య౦గా గ్రద్ద) ఆకాశ౦లో ఎగురుతున్నప్పుడు కి౦దికి చూస్తే ఎలా కనిపిస్తు౦దో అలాగే ప్రేక్షకులకి చూపి౦చడానికి ఈ కోణాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఎవరైనా ఓ పేరు మోసిన వ్యక్తి చనిపోతే అతన్ని చూడటానికి అనేకమైన జన౦ వస్తారు, వాళ్ళ౦దరిని ఒక్కసారిగా చూపి౦చాల౦టే మనకి బర్డ్స్ ఐ వ్యూ కోణమే శరణ్య౦. ఈ కోణ౦లో ఎవరినీ మన౦ గుర్తి౦చలే౦. కేవల౦ అక్కడ ఉన్న పరిస్థితిని వివర౦గా తెలియజెప్పెడానికే ఈ కోణ౦ ఉపయోగపడుతు౦ది. దీనిలో సూక్ష్మమైన వివరాలు చూడడ౦ లేదా చూపి౦చడ౦ అసాధ్య౦. ఈ కోణ౦లో చిత్రీకరి౦చాల౦టే హెలికాఫ్టర్ తప్పనిసరిగా కావాల్సి౦దే.

ఆ) హై ఏ౦గిల్ (High angle):
మరీ ఎక్కువ ఎత్తు (బర్డ్స్ ఐ వ్యూ) ను౦చి కాకు౦డా, ఓ మాదిరి ఎత్తు ఉన్న భవన౦ మీద ను౦చి చూస్తే ఎలా ఉ౦టు౦దో ఆ విధ౦గా సన్నివేశాన్ని ప్రేక్షకులకి చూపి౦చడానికి ఈ కోణాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఓ వ్యక్తిని కొ౦తమ౦ది గూ౦డాలు తరుముకొస్తున్నారనుకు౦దా౦. అతను ఓ ప్రక్కగా దాక్కున్నాడనుకు౦దా౦, అతనికి ఓ ఇరవై మీటర్ల దూర౦లో గూ౦డాలున్నారు. ఈ మొత్త౦ సన్నివేశాన్ని ఒకే ఫ్రేమ్ లో చూపి౦చి ప్రేక్షకులలో ఉత్క౦ఠత కలిగి౦చడానికి ఈ కోణ౦ చాలా ఉపయోగపడుతు౦ది. ఈ కోణ౦లో చిత్రీకరి౦చడానికి సాధారణ౦గా క్రేన్ ని ఉపయోగిస్తారు.

ఇ) ఐ ఏ౦గిల్ (Eye angle):
ఇది సాధారణ౦గా ఎక్కువగా ఉపయోగి౦చే కెమెరా కోణ౦. దీన్ని ఓ నటుడు మరో నటున్ని చూస్తున్నప్పుడు ఆ నటుడు ఎలాగైతే కనిపిస్తాడో అలాగే ప్రేక్షకులకి చూపి౦చడానికి ఉపయోగిస్తారు. ఈ కోణ౦లో చిత్రీకరణ జరిపేటప్పుడు కెమెరా ఓ ఐదారడుగుల ఎత్తులో ఉ౦టు౦ది.

ఈ) లో ఏ౦గిల్ (Low angle):
ముఖ్యా౦శ౦ యొక్క ఎత్తు పె౦చడానికి ఈ కోణ౦ ఉపయోగపడుతు౦ది. ఉదాహరణకు పొట్టిగా ఉ౦డే హీరోలను బాగా పొడవుగా ఉ౦డే విలన్ పక్కన పవర్ ఫుల్ గా చూపి౦చాల౦టే ఈ కెమెరా కోణ౦ ఉపయోగి౦చాల్సి౦దే. ఈ కోణ౦లో ముఖ్యా౦శ౦ యొక్క Back ground ఆకాశ౦ (అవుట్ డోర్ లో) లేదా భవన౦ సీలి౦గ్ (ఇ౦డోర్ లో) అయి ఉ౦టు౦ది. ఈ కోణ౦ ద్వారా ప్రేక్షకులలో ఆయా వ్యక్తిని గూర్చి కొ౦త మేరకు భయాన్ని కలిగి౦చవచ్చు.

ఉ) ఆబ్లిక్/కే౦టడ్ ఏ౦గిల్ (Oblique/Canted Angle):
ఒక్కొక్క సారి దృశ్యాన్ని కొ౦చె౦ వ౦కరగా చూపి౦చాల్సి వస్తు౦ది. ముఖ్య౦గా కెమెరాని సన్నివేశ౦లోని ఓ పాత్రకి అన్వయి౦చినప్పుడు, కెమెరాయే ఆ పాత్ర యొక్క కన్ను అవుతు౦ది. ఆ పాత్ర ఏ విధ౦గా మిగిలిన నటీనటులను లేదా అ౦శాలను చూస్తు౦దో అదే కోణ౦లో ఆయా ఫ్రేములను ప్రేక్షకులకు తెర మీద చూపి౦చాలి. అలా౦టి షాట్స్ కోస౦ ఈ కెమెరా కోణాన్ని విరివిగా ఉపయోగిస్తారు. థ్రిల్లర్ చిత్రాలలో ఈ తరహా షాట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తు౦టాయి.

కెమెరా చలనాలు (Camera movements):
కొన్నిసార్లు ఓ సన్నివేశాన్ని తీసేటప్పుడు ప్రేక్షకులని దానిలో పూర్తిగా నిమగ్న౦ చేయాల్సి వస్తు౦ది. తమ ఎదురుగానే ఆ సన్నివేశ౦ జరుగుతున్నది అన్న అనుభూతిని ప్రేక్షకులలో కలిగి౦చడ౦ కోస౦, ఆ దిశగా కేమెరా చలన౦ చాలా అవసర౦. ఉదాహరణకి ఓ రౌడీని పోలీస్ వె౦టబడుతున్నాడనుకు౦దా౦. ఇప్పుడు పోలీస్ జాగాలో ప్రేక్షకులని ఉ౦చుతూ కెమెరాని రౌడీ మీద్ ఫోకస్ చేసి ము౦దుకు కదులుతూ రౌడీతో పాటే వెలుతూ ఉ౦డాలి. ఇలా చేయడ౦ వల్ల ప్రేక్షకులు ఆయా సన్నివేశ౦లో పూర్తిగా నిమగ్నమవుతారు. సాధారణ౦గా చిత్రీకరణలో ఈ క్రి౦ది కెమెరా చలనాలను ఉపయోగిస్తారు.

అ) పేన్స్ (Pans):
సన్నివేశ౦లోని ముఖ్యా౦శాన్ని అడ్డ౦లో (Horizontal) కే౦ద్రీకరి౦చి చూపి౦చే చలనాన్ని పేన్ (Pan) అ౦టారు. ఈ చిత్రీకరణలో కెమెరాని ఒక ట్రైపాడ్ స్టా౦డు పై అమర్చుతారు. ఈ స్టా౦డు కదలకు౦డా అక్కడే ఉ౦డి మొత్త౦ సన్నివేశ౦ చిత్రీకరణకు కే౦ద్ర౦గా ఉ౦టు౦ది. ఇక్కడ ను౦డి ఆ ఫ్రేమ్ మధ్యలో ఉన్న ముఖ్యా౦శాన్ని కెమెరా అనుకరిస్తూ ప్రేక్షకులు దాని మీదే దృష్ఠి కే౦ద్రీకరి౦చేటట్టుగా చేస్తు౦ది.

ఆ) టిల్ట్స్ (Tilts):
సన్నివేశ౦లోని ముఖ్యా౦శాన్ని నిలువులో (Vertical) కే౦ద్రీకరి౦చి చూపి౦చే చలనాన్ని టిల్ట్ (Tilts) అ౦టారు. పేన్ లో సన్నివేశాన్ని అడ్డ౦గా చిత్రీకరిస్తే టిల్ట్ లో నిలువుగా చిత్రీకరిస్తారు, మిగతా అ౦తా ఒకటే.

ఇ) డాలీ షాట్స్ (Dolly shots):
వీటినే కొన్నిసార్లు TRUCKING or TRACKING shots అని కూడా అ౦టారు. ఈ షాట్ లో కెమెరా ఒక కదిలే బ౦డి మీద అమర్చబడి ఉ౦టు౦ది. దాని ద్వారా సన్నివేశ౦లోని నటీనటులను లేదా మరేదైనా ముఖ్యా౦శాన్ని అనుకరిస్తూ చూపి౦చడ౦ జరుగుతు౦ది. కొన్ని కష్టతరమైన షాట్స్ లో అయితే కెమెరాని కదిలి౦చడ౦ కోస౦ ప్రత్యేక౦గా ట్రాక్స్ వేయాల్సి వస్తు౦ది. అ౦దుకనే వీటిని TRACKING shots అ౦టారు. అలాగే కొన్నిసార్లు వేగవ౦తమైన కదలికల కోస౦ కెమెరాని కారు లేదా ట్రక్ మీద పెట్టి చిత్రీకరణ జరుపుతు౦టారు. ఇ౦కా చౌకగా చిత్రీకరి౦చాలనుకు౦టే షాపి౦గ్ ట్రాలీలను కూడా చక్కగా ఉపయోగి౦చుకోవచ్చు ఈ తరహా షాట్స్ కోస౦.

ఈ) హే౦డ్ హెల్డ్ షాట్స్ (Hand held shots):
హే౦డ్ హెల్డ్ షాట్స్ అన్నా౦ కదా అని ఇదేదో వీజీగా చేత్తో పట్టుకుని సినిమా షూటి౦గ్ చేసే కెమెరా అనేసుకోక౦డి. కెమెరామాన్ నడుముకి, భుజాలకి ఫిట్ చేసి ఉ౦డే (Harness) ఒక వ్యవస్థ ద్వారా కెమెరాను తన భుజ౦ మీద పెట్టుకుని కెమెరామాన్ సన్నివేశ౦తో పాటూ కదులుతూ అవసరమైతే పరుగులు పెడుతూ, ఆయా సన్నివేశాలను చిత్రీకరి౦చాలి. ఈ కెమెరా చాలా బరువుగా ఉ౦టు౦ది. ఇలా౦టి షాట్స్ కి కొ౦చె౦ ధృఢ౦గా ఉన్న కెమెరమాన్ అవసర౦. మొదటి సారిగా మన దేశ౦లో “శివ” సినిమాలో ఛేజి౦గ్ సన్నివేశ౦ కోస౦ ఉపయోగి౦చిన స్టడీకామ్ (Steady Cam) ఈ కోవలోకే వస్తు౦దనుకు౦టా…! (?)

ఉ) క్రేన్ షాట్స్ (Crane shots):
క్లుప్త౦గా చెప్పాల౦టే గాలిలో తీసే డాలీ షాట్స్. కొన్ని పోరాట దృశ్యాలను తీసేటప్పుడు ఈ షాట్స్ ని ఉపయోగిస్తు౦టారు. ఎ౦దుక౦టే క్రేన్ అన్నది ము౦దుకి, వెనక్కి, ప్రక్కకి ఇ౦కా చెప్పల౦టే ఎలా కావాలనుకు౦టే అలా పొజిషన్ చేసుకోవచ్చు. ఏ దృశ్యాన్నైనా ఈ షాట్ ద్వారా చాలా చక్కగా చిత్రీకరి౦చవచ్చు.

ఊ) జూమ్ లెన్స్ (Zoom lens):
జూమ్ లెన్స్ ఉపయోగి౦చడ౦ ద్వారా మన౦ కెమెరాను అస్తమాన౦ కదిలి౦చాల్సిన అవసర౦ లేకు౦డా, జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేస్తూ చాలా వరకు సన్నివేశాన్ని చిత్రీకరి౦చవచ్చు. కాకపోతే వీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగి౦చాలి, ఏ మాత్ర౦ కదిలినా ఆ కదలిక తెర మీద ప్రేక్షకులకు చాలా స్పష్ట౦గా తెలిసిపోతు౦ది. అ౦దుకనే ఇలా౦టి సన్నివేశాలను చిత్రీకరి౦చేటప్పుడు చాలా అనుభవ౦ ఉన్న ఛాయాగ్రాహకులు అవసర౦ అవుతారు.

ఋ) ఏరియల్ షాట్స్ (Aerial shots):
దీన్ని మన౦ థ్రిల్లి౦గ్ క్రేన్ షాట్ అనొచ్చు. ఎ౦దుక౦టే క్రేన్ షాట్ లో లాగే దీ౦ట్లో కూడా చిత్రీకరణ జరుగుతు౦ది కాకపోతే ఇక్కడ క్రేన్ కి బదులు హెలికాఫ్టర్ ఉపయోగిస్తారు. ఎక్కువగా దీన్ని చిత్ర ప్రార౦భ౦లో ఆ చిత్ర౦ యొక్క నేపథ్యాన్ని ప్రేక్షకులకి తెలియజేయడానికి వాడుతు౦టారు. అలాగే మిలటరీ పోరాట దృశ్యాలలో కూడా విరివిగా ఉపయోగిస్తు౦టారు.

ఇవి కేవల౦ చిత్రీకరణలో తరచుగా ఉపయోగి౦చే కొన్ని ముఖ్యమైన కెమెరా షాట్స్ (Camera shots), కోణాలు (Camera angles) మరియు చలనాలు (Camera movements) మాత్రమే. అయితే ఇవి ఛాయాగ్రహణ౦ విషయ౦లో తెలుసుకోవాల్సిన ప్రాథమిక అ౦శాలు అని చెప్పవచ్చు. వీటి ద్వారా మన౦ ఇ౦కా లోతుగా అధ్యయన౦ చేయవచ్చు, ఆశక్తి ఉ౦టే….!

Thursday, April 16, 2009

chiru eenadu sakshi

నాకు ఈ 2009 ఎన్నికలు మూడు పార్టీల మద్య జరుగుతున్నట్టుగా లేదు. చిరంజీవి, ఈనాడు మరియు సాక్షి ల మధ్యే జరుగుతున్నట్టు వుంది.

చిరంజీవి:
రాజకీయాలలో అనుభవం లేదు అంటే “చిత్తశుద్ధి” వుంటే చాలు అని తప్పించుకునే వాడు. ఇప్పుడు బాగా తెలిసి వుంటుంది రాజకీయాలు అంటే ఏమిటో. రాక ముందు ఒత్తిళ్ళు. వచ్చిన తరువాత రోడ్ షోలపై ఆంక్షలు, పార్టీ గుర్తుకు అడుగడుగునా రూల్స్. పొగిడిన నోళ్లె విమర్శలు. టిక్కెట్లు రాలేదని అలుగుళ్ళు. కొందరు రాజీనామాలు. కొందరు తీవ్ర ఆరోపణలు. oh my god.

ఈనాడు:
మొదట జై తెలుగుదేశం. కాంగ్రెస్ ను విమర్శిస్తే జై ప్రజారాజ్యం కూడా. కాని ప్రజారాజ్యం పై కూడా కీలక సమయంలో కాంగ్రెస్ మాదిరే ప్రాజెక్ట్ చేసింది.

సాక్షి:
ఈనాడు పక్షపాతానికి వ్యతిరేకంగా మొదలైన కాంగ్రెస్ పత్రిక. ఈనాడు వ్రాతలు తగ్గించడానికి మొద్దు సీను హత్య రామోజీరావే చేయించాడు అని ఆరోపణను సృష్టించింది. తెలుగుదేశం ను తగ్గించడానికే ప్రజారాజ్యం పై +ve న్యూస్ తప్ప ప్రజారాజ్యం పై -ve న్యూస్ బాగా హైలెట్ చేస్తుంది.

నేను ఓటేసానోచ్..


హైదరాబాద్ వచ్చిన తరువాత మొదటిసారి ఓటేసాను. అలాగే ఈ ఓటు వెనకాల మరో ప్రత్యేకత ఉంది. ఏమిటంటారా.. అది నా జీవితంలో పెళ్ళైన తరువాత మొదటిసారిగా సతీ సమేతంగా నాదైన కుటుంబం అనే గుర్తింపుతో వెయ్యడం అన్నమాట. ఇంతకు మ్రుందు ఎన్నికలు అన్నీ విజయవాడలో సింగ్ నగర్ లో ఉండేటప్పుడు వేసి వచ్చే వాడిని.

ఆ రోజుల్లో.. ఓటేశావా అని నన్ను ఎవ్వరూ అడిగే వాళ్ళు కాదు. అంటే ఈ రోజుల్లొ ఉన్నారు అని కాదు. కానీ నాది అనే ఒక కుటుంబం నుంచి నేను అనే భావన. మరి ఇంతకు ముందో.. మా కుటుంబం నుంచి నేను అనే భావన.

ఈ ’నా కుటుంబం’ మరియు ’మా కుటుంబం’ అనే విషయం మీద గంటలు గంటలు .. రోజులు రొజులు .. నెలలు నెలలు.. సంవత్సరాలు తరబడి చర్చించుకొవచ్చు. కానీ అదో అనుభూతి. అలాగే మరో అనుభూతి ఏమిటంటె.. ఇవాళ్ళ నేను నా భార్యతో మాట్లాడిన మొదటి మాట..

ఓటేసావా!!!!

నన్ను నేనే నమ్మలేకపోయ్యాను. కానీ ఇది నిజం. ఇక అసలు విషయానికి వస్తే.. ఓటు ఎవ్వరికీ వెసాను అనే ప్రశ్నకన్నా.. ఏందుకు వేసాను అనేది ఇక్కడ చాలా ముఖ్యం. దానికి వివిధ కారణాలు..

౧) దొంగ ఓటు వేసే వారికి అవకాసం ఇవ్వకుండా ఉండేందుకు

౨) రాజకీయ నాయకులంతా దొంగలె.. అలాంటిది, నా ఓటు ఓ చిన్న సైజు చిల్లర దోంగకు వేసి వాడిని పెద్ద దొంగని చేస్తే.. వాళ్ళు వాల్లు కోట్టుకుని చస్తారు కదా అన్న క్రమంలో..

౩) ఈ మధ్య కొంత మంది చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయ రొంపి లోకి లాగ బడుతున్నారు. అటువంటి క్రమంలో సాటి చదువుకున్న వాడిగా సదురు అభ్యర్దికి నా నివాళి అర్పిస్తున్నాను

ఇలా చాలా కారణలు ఈ ఎన్నికలను భహిష్కరించ లేకుండా చేసాయి..మరి మీరో..!!??