Wednesday, March 11, 2009

కొత్త ఉద్యోగం

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం దాదాపుగా ఒకే రాష్ర్టానికి చెందిన ఉద్యోగులు కలసి పనిచేసేవారు. కానీ ప్రస్తుతం సంస్థల్లో భిన్న సంస్కృతులు కనిపిస్తున్నాయి. భిన్నప్రాంతాలకు చెందిన వారు కలిసి ఒకేచోట పనిచేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో విదేశీయులతో కూడా పనిచేయాల్సి వస్తోంది. ఇవన్నీ ప్రపంచీకరణ తెస్తున్న మార్పులు. వచ్చిన వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సంస్థలు ప్రతిభావంతుకోసం జల్లెడపట్టక తప్పదు. ఇలాంటి వారు ఒకే ప్రాంతంలో ఉంటారన్న భరోసా ఏమీ లేదు. వారు ఏ ప్రాంతంలో ఉన్నా వారిని సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. ఇది కంపెన్లీల్లో మిశ్రమసంస్కృతికి దారితీస్తోంది.

ఈ పరిస్థితుల్లో రాణించాలంటే కేవలం పనిలో సామర్ధ్యం చూపించిన మాత్రాన సరిపోదు. జట్టు సమతూకం సరిగ్గా ఉండేట్లు ప్రతి ఒక్కరూ తమవంతు కృషచేయాలి. లేదంటే జట్టు మొత్తానికి చెడ్డపేరు వస్తుంది. ఒక వ్యక్తి దృక్పథంపై అతను పెరిగిన సమాజం ప్రభావం చూపిస్తుంది. అతని ఆలోచన సరళి, ఆకళింపు చేసుకునే విధానం, సమస్యలను చేసే కోణం, పరిష్కరించే విధానం, తెలియచెప్పే పద్ధతి... ఇలా అన్నీ అతను పెరిగిన సమాజానికి అనుగుణంగానే ఉంటాయి. అవన్నీ మరో వ్యక్తి కోణంలో భిన్నంగా కనిపించవచ్చు. దీన్ని కూడా అధిగమించి వాస్తవ అంశాలను సరిగ్గా బేరీజు వేసుకున్నప్పుడే జట్టు సమతూకం దెబ్బతినకుండా ఉంటుంది.

  • సహోద్యోగుల సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చాలి.
  • వారి పండుగలు వగైరా వాటికి శుభాకాంక్షలు చెప్పాలి. వీలయితే వారితో కలిసి వేడుకలు జరుపుకోవాలి.
  • వారి భాష నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చాలి.
  • మీ సంస్కృతి సంప్రదాయాల గురించి వారికి తెలపండి. పండగల సమయాల్లో వారిని మీ ఇంటికి ఆహ్వానించండి.
  • వీలైనప్పుడు వారి వివాహవేడుకలకు హాజరవ్వండి. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వారిని ఆహ్వానించండి.
  • ఖాళీ సమయాలు, వారాంతపు సెలవుల్లో వారితో మిత్రులంతా కలసి దగ్గర్లోని చారిత్రక ప్రదేశానికో... దేవాలయానికో వెల్లేలా ప్రణాళిక వేసుకోండి.
వారితో ఏవైనా విబేదాలు వస్తే.. వాటిని సామనస్యంగా పరిష్కరించుకోండి. యాజమాన్యం వరకూ తీసుకెళ్లే అది మీకు, వారికి ఇద్దరికీ మంచిదికాదు.

No comments:

Post a Comment