Tuesday, December 29, 2009

చిత్ర లోకం @ తెలంగాణ

మీకో దండం. ఇక తమరు పెద్దాపురం కానీ,చిలకలూరిపేట కానీ వెల్లండి.

ఆంధ్రా ,తెలంగాణా కాకులు.


జోడు గుర్రాలపై స్వారీ...!


నా సీటుకే ఎసరు పెడదామనుకున్తున్నావా ...!


వందా... నా బొందా...!

ముఖ్యమంత్రి రోశయ్య గారు అనేక సమస్యలను ఎదుర్కుంటూ ఈ మద్యనే వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు.


ముక్కలు చెక్కలు

రాష్ట్రాన్ని చేస్తే అయిదు ముక్కలు చేయండి లేదంటే ఒక్కటిగా ఉంచండి అంటూ సీమ,ఆంద్ర MLAలు రాజీనామాలు చేయడం మొదలెట్టారు. కొంత మంది నాయకులు ప్రత్యెక తెలంగాణ కావాలంటే మిలిగిన వాళ్లు నెల్లూరు ,ప్రకాశం జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలంటున్నారు. కొంతమంది హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, మరికొంతమంది విశాక రాజదానిగా కళింగ ఆంద్ర కావాలని అడుగుతున్నారు. పాపం గుంటూరు,కృష్ణా,ఉభయ గోదావరి జిల్లాలు ఎవరికీ వద్దంట. ఈ జిల్లాలను కలిపి ఐదో రాష్ట్రం చేస్తే సరిపోతుంది.
ఈ MLAల రాజీనామాల తో రాష్ట్రంలోని అన్ని పార్టీలలో సంక్షోభం వచ్చి పడింది.ప్రభుత్వం వుంటుందో ఊడుతుందో అర్ధం కాని పరిస్థితిలో ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు.రోజు బంద్ లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ బంద్ ల వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా. ఈ బంద్ ల వల్ల ఆర్టీసీ ,విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఎన్నాళ్ళు బంద్ లు కొనసాగిస్తారు.మరోవైపు మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి రాజీనామాలు చేస్తామంటున్నారు. సోనియా పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది. హైకోర్టు లో న్యాయవాదులు వాదులాడుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆమరణ నిరాహారదీక్ష పెద్ద ప్యాషన్ ఐపోయింది. ప్రతివాడు దీక్షలు చేసేవాడే.
మన లగడపాటి గారి వాదన ఏమిటంటే సమైక్యంగా ఉంటే ఎక్కువ మంది లను పార్లమెంటు కు పంపితే ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చని.మరి ఇప్పుడు ముప్పయికి పైగా ఎం.పి. లు ఉంది ఎన్ని నిధులు తెచ్చారో.ఈయన గారు మనకు రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరిగినప్పుడు,వరదసాయం లో అన్యాయం జరిగినప్పుడు ఏమిచేస్తున్నారు.ఇలాంటి ఎం.పి. లు ముగ్గురు ఉన్నా మూడు వందలమంది ఉన్నా ఒరిగేది ఏమిలేదు. అందరు అన్ని పంచుకోగా మిగిలిన ఏదో ఒక పనికిమాలిన మంత్రి పదవి పడేస్తే అదే మహాభాగ్యమని మన కాంగ్రెస్ ఎం.పి. లు సంబరపడిపోతారు. వీళ్ళు మనకి నిధులు తీసుకువస్తారా.
ఇదంతా సోనియా ఆడిస్తున్న డ్రామా. రాష్ట్రం లో జగన్ వర్గానికి చెక్ పెట్టడానికి,అందరిని తన కంట్రోల్ లో పెట్టుకోవడానికి ఇలా ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడిప్పుడే బలపడుతున్న తే.దే.పా. ను చీల్చడానికి పన్నిన ప్లాను ఇది. దీనివల్ల పాపం ప్రజలలో ప్రాంతీయ విబేదాలు సృష్టిస్తున్నారు.జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ సొంత పార్టీ లో MLAలు ఎంత గోల చేసినా అందరిని అణచివేసిన సోనియా కే.సి.యార్. కు లొంగుతుందా. అయితే ఎత్తు కు చంద్రబాబు షాక్ తిన్నాడు.పార్టీ వాళ్లు రెండుగా విడిపోతున్నారు.తెలంగాణ పై వెనక్కు తగ్గితే మేము కూడా రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో ఆలస్యంగానైనా తేరుకున్న బాబు కోస్తా,సీమ ఎం.ఎల్.. లను రాజీనామాలు ఆమోదించాలంటూ స్పీకరుని డిమాండ్ చేయిస్తున్నాడు, తెలంగాణా ఏం.ఎల్.ఎ లను కూడా ఉద్యమాలు చేయాలని చెప్తున్నాడు. విదంగా ముందుకు పోవడం వల్ల కాంగ్రెస్ ఎం.ఎల్. లను డిఫెన్స్ లో పదేయ్యోచ్చునని బాబు గారి ఆలోచన కాబోలు. ఏది ఏమైనా ఏది ఒక సస్పెన్స్ సినిమా క్లైమాక్సు చూస్తున్నట్టుగా ఉంది. మరి ముగిపు ఎలా,ఎప్పుడు ఉండబోతుందో నాకు అర్ధం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

Saturday, December 19, 2009

సలీమ్ (మూవీ రివ్యూ)

saleem

తెలుగువన్‌ రేటింగ్‌ - 2.5/5
బ్యానర్ - శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
స్టోరీ, స్క్రీన్‌ప్లే ,డైరెక్షన్ - వైవిఎస్ చౌదరి
ప్రొడ్యూస్డ్ - డాక్టర్ మోహన్ బాబు.
మ్యూసిక్ డైరెక్టర్ - సందీప్ చౌతా
సినిమ్యాటోగ్రఫీ – సి. రామ్‌ప్రసాద్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావు
ఆర్ట్ – ఆనంద్ సాయి
ఫైట్స్ – కనల్ కణ్ణన్
లిరిక్స్ – చంద్రబోస్‌
రిలీజ్‌ డేట్‌ – 12-12-2009

కాస్ట్:

మోహన్ బాబు, విష్ణు, భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వేణు మాధవ్ నెపోలియన్, జయప్రకాష్ రెడ్డీ, ముఖేష్ ఋషి, రాహుల్ దేవ్, జీవ, తెలంగాణా శకుంతల, హేమ, మాస్టర్ భరత్ అండ్ అదర్స్…

కథ
యూరప్ నుండి సత్యవతి (ఇలియానా) తన తల్లిదండ్రులు చెప్పిన రోజుకంటే ఒక రోజు ముందే ఇండియాకు తిరిగి వస్తుండగా ఆమెను అప్పలనాయుడు (ముఖేష్ఋషి) తమ్ముడు చంటి చంపాలని ప్రయత్నిస్తాడు. అతని బారి నుండి మున్నా (విష్ణు) ఆమెను కాపాడటమే కాకుండా సత్యవతితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మున్నా సత్యవతిని చంపడానికి ప్రయత్నించింది ఎవరు అని అడుగుతాడు సత్యవతి తండ్రి సింగమనాయుడుని. వాడి గురించి మున్నాకు వివరించిన సింగమనాయుడు వెంటనే సత్యవతికి పెళ్ళిచేయాలని యూరప్‌లో వున్న తన ఫ్రెండ్‌కి చెప్పగానే అతను ఒక మంచి సంబంధం వుంది నేను పంపిస్తున్నాను వారు సత్యను చూడటానికి వస్తున్నారు అని వివరిస్తాడు.
సత్యను చూడటానికి వస్తున్న యూరప్‌ పెళ్ళివారిని అప్పలనాయుడు హతమార్చి వారి ప్లెస్‌లో వేరేవారిని పంపిస్తాడు. సత్యను చూడటానికి పెళ్ళివారు వస్తున్నారు అని తెలుసుకున్న మున్నా సత్యను ఒక గదిలో బందించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఈ పెళ్ళి నాకు ఇష్టంలేదని చెప్పు.. లేక పోతే నేనే ఈ పెళ్ళి చెడగొడతాను అని అంటాడు. సత్యవతి మాత్రం తనకు పెళ్ళి కొడుకు నచ్చాడు పెళ్ళిచేసుకుంటాను అని తన ఫ్యామిలీతో చెబుతుంది.
ఇక పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మున్నా మాత్రం వచ్చిన పెళ్ళివారి గురించి ఎంక్వయిరీ చేసి వారు యూరప్ పెళ్ళివాళ్ళు కాదని వాళ్లు అప్పలనాయుడు మనుషులని తెలుసుకొని వారిని చంపేసి సింగమనాయుడు ఫ్యామిలీ జోలికి ఇక రావద్దని అప్పలనాయుడికి వార్నింగ్‌ ఇస్తాడు. ఇక మున్నా తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకున్న అప్పలనాయుడు అడుగడుగునా తన కూతుర్ని కాపాడుతున్న మున్నాకే సత్యని ఇచ్చి పెళ్ళిచేయాలని నిర్ణయించి వారిని ఆ గ్రామంలో వున్న గుడికి తీసుకువెళ్ళగా ఆ గుడి నుంచి కొంతమంది రౌడీల సహాయంతో సత్యవతి యూరప్‌ పారిపోతుంది. సత్యవతి తన ఫ్యామిలీ చేస్తున్న పెళ్ళి నుంచి యూరప్ ఎందుకు పారిపోయింది? మున్నా సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..
వై.వి.ఎస్‌. చౌదరి, మోహన్‌బాబు, విష్ణువర్థన్‌ బాబుల కాంబినేషన్‌లో సినిమా అంటే ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగానే పెరిగాయి. అయితే వారి ఎక్స్‌పెక్టేషన్‌కి ఏమాత్రం అందుకోలేకపోయాడు ఈ సలీమ్‌. మోహన్‌బాబు లాంటి మంచి నటుడుని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఆయన పాత్ర స్వభావం, తీరు చిత్రీకరించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు. ఫస్టాఫ్‌ అంతా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో సాఫీగానే సాగిపోయిన చిత్రం సెకండాఫ్‌కి రాగానే ప్రేక్షకుల ఊహలకి అందని రీతిలో చతికిలపడిపోయింది. కథ, కథనంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విషయంలో దర్శకుడు మరికొంత కసరత్తు చేసుంటే బావుండేది.

నటన-: ఈ చిత్రంలో మున్నాగా మంచు విష్ణు చాలా చక్కగా నటించాడు. తన బాడీలోనే కాదు తన నటనలో కూడా చాలా మార్చు వచ్చింది. డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో బాగా ఇంప్రెసివ్‌గా కనిపించాడు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించిన మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ క్యారెక్టర్‌ చేసినా దానికి న్యాయం చేయడం ఆయన నైజం. ఇక అందాల ముద్దుగుమ్మ ఇలియానా విషయానికి వస్తే… సత్యవతి క్యారెక్టర్‌లో చాలా అద్బుతంగా నటించింది.
ఫోటోగ్రాఫీ-: బాగానే వుంది.
సంగీతం -: సందీప్‌ చౌతా ఈ చిత్రానికి అందించిన సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా రీమిక్స్‌ సాంగ్‌ “పూలు గుస గుస లాడేనని..” అనే సాంగ్‌ చాలా బాగుంది.

ఎడిటింగ్‌ -: ఇంత పెద్ద సినిమాని ఎంతని ఎడిట్‌ చేస్తాడు ఏ ఎడిటరయినా. ఉన్నంతలో ఎడిటింగ్‌ బాగుంది.


ఏది ఏమైనా ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఆనందించవచ్చును.

గణేష్ @ 2009

Page:1 | 2 | Next > >