Wednesday, May 20, 2009

ఎలెక్షన్

తెరాసా, లెఫ్ట్ వేస్ట్:..చిరు భేష్



చంద్రబాబుఫ్లాపు అయ్యాడు. చిరంజీవి అత్తరు ఫ్లాపు అయ్యాడు. కే సి ఆర్ మరియు వామ
పక్షాలు అస్సలు పుట్టగతులు లేకుండా పోయాయి అనే మాటలను కాసేపు పక్కన
పెడితే...


ఈ ఎన్నికలలో మొదటిసారిగా పోటీ చేసిన ప్రజా రాజ్యం అదికారాన్ని
చెప్పట్టాలని మరీ పగటి కలలు కన్నా మనకి 'వాళ్లకు ఎంత విషయం ఉందని' ముందే
తెలుసు కదా.

అదిపక్కన పెడితే ఎప్పుడో పెట్టిన పక్షాలు అయిన తెరాసా, వామ పక్షాలు చంద్రబాబు
ఏదో భీబత్సంగా గెలుస్తాడు, మనందరికీ 'దోచి పెడతాడు' అని చంకలు బాదుకుంటూ
వెళ్లి ఆయన ఒళ్లో కూర్చున్నారు. చిరంజీవి మాతో కలవండి బాబులు అని ఎంత
మొత్తుకున్నా అస్సలు పట్టించుకోలేదు పాపం అతన్ని. అంతా అయిపోయాకా మాత్రం
వెధవలు అయ్యారు. చిరంజీవి కాస్తో కూస్తో పరువు కాపాడుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ క్రింది అంకెలు చూస్తే చిరంజీవి చాల బాగావోట్లు సంపాదించాడు అనే చెప్పాలి. పదహారు శాతం దగ్గర ఆగిపోవడం నిజంగా ఇటు
కాంగ్రెస్ కి అటు తెదేపా కి చాల మంచిదయింది. ఇంకొక్క శాతం ఎక్కువ వోట్లు
సంపాదించి ఉంటె ప్రధాన పార్టీల తలరాతలు తారుమారు అయ్యేవి. క్లుప్తంగా
చెప్పాలంటే తెరాసా కన్నా నాలుగింతలు వోట్లు సంపాదించాడు. అదేమీ మామూలు
విషయం కాదు.


ఇకనయినా ఉన్న రెండు ప్రధాన పార్టీలకు తొత్తులుగా (అదీ వంతులు వారీగా)
ఉండడం మానేసి జనంలోకి వెళ్లి బుద్దితెచ్చుకున్ట్టారో లేదో మరి తెరాసా,
వామపక్షాలు.

No comments:

Post a Comment