Thursday, August 27, 2009

పోఖ్రాన్- 2పై ప్రకటనలన్నీ బూటకమేనా?


దేశ అణు సామర్థ్యంపై అనుమానాలకు దారితీసే సంచలనాత్మక వివరాలను ఓ సీనియర్ డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ఒకరు గురువారం వెల్లడించారు. పోఖ్రాన్- 2 అణు పరీక్షలతో సంబంధం ఉన్న డీఆర్‌డీఓ సీనియర్ శాస్త్రవేత్త సంతానం మాట్లాడుతూ.. ఈ అణు పరీక్ష పాక్షికంగానే విజయవంతమైందని తెలిపారు. పోఖ్రాన్- 2 అణు పరీక్ష ఫలితాలు అంచనాలను అందుకోలేదన్నారు.

పోఖ్రాన్ అణు పరీక్ష కోసం పనిచేసిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల్లో ఒకరైన కె.సంతానం వెల్లడించిన సంచలనాత్మక వివరాలను గురువారం ఓ ఇంగ్లీషు దినపత్రిక బయటపెట్టింది. భారత ప్రభుత్వం గతంలో పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతమైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనల్లో వాస్తవమెంత అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

భారత్ తన అణు సామర్థ్యాన్ని పటిష్టపరుచుకునేందుకు మరిన్ని అణు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సంతానం పేర్కొన్నారు. సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై సంతకం చేసే ముందు భారత్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని, దీని కోసం మరిన్ని పరీక్షలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

1998లో భారత్ పోఖ్రాన్- 2 అణు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆనాటి పరీక్షా ప్రదేశంలో సన్నాహకాలకు సంతానం డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ పరీక్షలో వచ్చిన ఫలితాలు అంచనాలకు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని సంతానం తాజాగా వెల్లడించారు. భారత్‌లో 1998లో థర్మోన్యూక్లియర్ పరీక్ష లేదా హైడ్రోజన్ బాంబు పరీక్ష నిర్వహించింది.

దీనిపై అనంతరం చేసిన ప్రకటనలు వాస్తవాలకు భిన్నమేనని, ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని సంతానం అన్నారు. అణు పరిభాషలో ఆనాటి పరీక్షను "ఫిజిల్‌" (తుస్సుమనే అర్థం)గానే భావించాలి. ప్రయోగం విజయవంతమైతే దానిని బిగ్‌బ్యాంగ్‌గా వ్యవహరిస్తారు. పోఖ్రాన్- 2 అనంతరం చేసిన ప్రకటనలు, వచ్చిన ఫలితాలకు భిన్నంగా ఉన్న కారణంగా సీటీబీటీపై సంతకం చేసేందుకు తొందరపడరాదని సంతానం సూచించారు.

ఈ దేశాని అ దేవుడే కాపాడాలి...

No comments:

Post a Comment