Friday, August 7, 2009

చిరు --చిరు గాలేనా?


హైదరాబాద్: ‘మన పార్టీ పరిస్థితి బాగోలేదు. మనం ఏ పాత్ర పోషిస్తు న్నామో, మన పాలసీలు ఏమిటో మనకే తెలియ డం లేదు. ఎవరికీ విశ్వాసం కల్పించకపోవడంతో నాయకులంతా వెళ్లిపోతున్నారు. నేను రాజకీ యాల నుంచి వచ్చినవాడిని. నన్ను నమ్ముకున్న వారంతా పార్టీ మనుగడపై ఆందోళనతో ఉన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ పద్ధతిని ఇకనయినా మార్చుకోవా’లని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. చిరు నివాసానికి వెళ్లిన దేవేందర్‌ గౌడ్‌ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చిం చారు.తాను టిడిపిలో చేరుతున్నానన్న సంకేతాలు పంపారు. అయితే.. పార్టీ వీడవద్దని, అంతా కలసి బలోపేతం చేద్దామని చిరంజీవి బ్రతిమిలాడారు. ఆ తర్వాత ఆయన తన రాజీనామా పత్రాన్ని చిరం జీవికి ఇచ్చారు.
మనం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లో బాగా వెళుతున్నాయని, అసెంబ్లీలో కూడా మనం ఏమీ మాట్లాడ కపోవడం వల్ల ప్రతిపక్షంగా గుర్తించే పరిస్థితి లేకుండా పోతోందన్నారు. నన్ను నమ్ముకుని వచ్చిన వారికి సర్దిచెప్పలేకపోతున్నానని, పార్టీలో మార్పు వస్తుం దని ఆశించినప్పటికీ అది వచ్చేలా కనిపించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలసి పోటీ చేయాలని సూచించారు. మీరు నాకు తగినంత గౌరవం ఇచ్చినప్పటికీ, నేను వచ్చిన రాజకీయ నేపథ్యం కారణంగా ఇమడలేకపోతున్నానన్నారు. పార్టీ పెట్టి ఇంతకాలమయినా ఇంకా రాజకీయ పార్టీగా రూపుదాల్చకపోతే కష్టమన్నారు. తామంతామిమ్మల్నే నమ్ముకున్నామని, మీరు ఇకపై ఏది చెబితే అది చేస్తామని హామీ ఇచ్చారు. తాను ప్రజల్లో తిరుగుతానన్నారు. అం దుకు స్పందించిన గౌడ్‌ ‘నేను మీతో వారం రోజులు ఒక అంశంపై చర్చించి దానిని మీడియా కు చెబితే, మీరు మరుసటిరోజునే దానిని ఖండిస్తారు. ఇక నాకేం విలువ ఉంటుంద’ని తానుపార్టీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు.
వెళ్లితే..వెళ్లనివ్వండి !
దేవేందర్‌గౌడ్‌ వెళ్లిపోతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆపార్టీ నాయకులు అధ్యక్షుడు చిరంజీవితో భేటీ అయ్యారు. అల్లు అరవింద్‌ ఈ విషయంపై దేవేందర్‌గౌడ్‌తో సమావేశమై నచ్చ చెప్పినా ఫలితం లేకపోవడంతో వారు చిరంజీవితో చర్చించినట్లు తెలిసింది. అల్లుఅరవింద్‌తోపాటు కొత్తపల్లి సుబ్బరాయుడు, ఉపేంద్రలు చిరంజీవితో కలిసినట్లు సమాచారం. సమావేశంలో చిరంజీవి ‘ వెళితే వెళ్లనివ్వండి..ఆయన మానసికంగా సిద్ధమ య్యారు..చాలా మంది వెళ్లిపోయారు..అయినా ఎలాంటి నష్టం లేదు..పార్టీని కిందిస్థాయి నుంచి పునర్నిర్మించుకుందాం..’ అన్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment